మన ఆర్థిక పునాదులు మహా స్ట్రాంగ్
ABN, Publish Date - Feb 05 , 2025 | 06:09 AM
కొన్ని సమస్యలున్నా భారత ఆర్థిక పునాదులు ఇంకా పటిష్ఠంగానే ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌పై ఇండియా టుడే-బిజినెస్ టుడే పత్రికలు నిర్వహించిన...
మన ఆర్థిక పునాదులు మహా స్ట్రాంగ్
పాత పన్ను విధానం ఆగదు
జీఎ్‌సటీ శ్లాబులు, రేట్ల కుదింపుపైనా దృష్టి
కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: కొన్ని సమస్యలున్నా భారత ఆర్థిక పునాదులు ఇంకా పటిష్ఠంగానే ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌పై ఇండియా టుడే-బిజినెస్ టుడే పత్రికలు నిర్వహించిన ఒక సదస్సులో ఆమె ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. సంస్థాగతంగా చూసినా భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా అభివృద్ధి బాటలోనే ఉందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే తమ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో మధ్య తరగతిని మురిపించిందన్న అనుమానాలను సీతారామన్ తోసిపుచ్చారు. పన్ను చెల్లింపుదారులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌కు సంబంధించి కొత్త పన్ను విధానంతో పాటు పాత పన్ను విధానమూ కొనసాగుతుందన్నారు.
పెట్టుబడులు తగ్గలే
కేంద్ర బడ్జెట్‌లో మూలధన పెట్టుబడులు తగ్గించారన్న ఆరోపణలను ఆర్థిక మంత్రి తోసిపుచ్చారు. నిజానికి ఈ పెట్టుబడులు సవరించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో నమోదైన రూ.10.18 లక్షల కోట్లతో పోలిస్తే రూ.1.03 లక్షల కోట్లు ఎక్కువన్నారు. ప్రస్తుత జీడీపీలో ఇది 4.3 శాతానికి సమానమన్నారు.
జీఎ్‌సటీ రేట్లపైనా త్వరలో నిర్ణయం
జీఎ్‌సటీ శ్లాబులు, రేట్ల హేతుబద్దీకరణపైనా జీఎ్‌సటీ మండలి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. మూడేళ్ల క్రితం ఇందుకోసం ఏర్పాటైన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీ త్వరలోనే తన నివేదిక సమర్పిస్తుందన్నారు. జీఎ్‌సటీ శ్లాబులతో పాటు సామాన్య ప్రజసలు ఉపయోగించే వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాలన్నదే తమ ధ్యేయమన్నారు.
ఆర్‌బీఐ కూడా కలిసి రావాలి
ధరల సెగ లేకుండా ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు మొన్నటి బడ్జెట్‌లో, కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ కూడా జీడీపీ వృద్ధి రేటుకు సహకరించాలని పరోక్షంగా వడ్డీ రేట్లు తగ్గించాలని కోరారు. శుక్రవారం ప్రకటించే ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక రెపో రేటుపైనా నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో పాండే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
Ratan Tata: రతన్ టాటా యంగ్ ఫ్రెండ్ శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో కీలక పదవి
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 05 , 2025 | 06:09 AM