మార్కెట్లోకి వన్‌ప్ల్‌స 13,
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:09 AM
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్ల్‌స.. భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. వన్‌ప్ల్‌స 13, వన్‌ప్ల్‌స 13ఆర్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చింది. వీటితో పాటు వన్‌ప్ల్‌స బడ్స్ ప్రొ3 ఇయర్‌బడ్స్‌ను...
13 ఆర్ స్మార్ట్‌ఫోన్లు
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్ల్‌స.. భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. వన్‌ప్ల్‌స 13, వన్‌ప్ల్‌స 13ఆర్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చింది. వీటితో పాటు వన్‌ప్ల్‌స బడ్స్ ప్రొ3 ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేసింది. వన్‌ప్ల్‌స 13 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో 12+256 జీబీ, 16+512 జీబీ, 24+1 టెరాబైట్‌తో అందుబాటులో ఉండనుంది. వీటి ధరలు వరుసగా రూ.69,999, రూ.76,999, రూ.89,999గా ఉన్నాయి. ఈ నెల 10 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అలాగే వన్‌ప్ల్‌స 13ఆర్ రెండు వేరియంట్లలో 12+256 జీబీ, 16+512 జీబీతో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.42,999, రూ.49,999గా ఉన్నాయి. ఈ నెల 13 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి.
స్నాప్‌డ్రాగన్ 8 ఇలీట్ ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120ఎఫ్‌పీఎస్ హెచ్‌డీఆర్ గేమింగ్, 120హెట్జ్ ప్రొఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ సామ్‌సంగ్ ఐసోసెల్ టెలిఫోటో కెమెరా, 8 ఎంపీ అలా్ట్రవైడ్ కెమెరా, ఆక్సిజన్ ఓఎస్ 15.. వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు. కాగా వన్‌ప్ల్‌స బడ్స్ ప్రొ ధర రూ.11,999గా ఉంది.
Updated Date - Jan 08 , 2025 | 05:09 AM