Oaktree Capital: హైదరాబాద్‌లో ఓక్‌ట్రీ కార్యాలయం
ABN, Publish Date - Mar 08 , 2025 | 02:55 AM
ప్రైవేట్ క్రెడిట్ రంగంలోని ఓక్‌ట్రీ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కంపెనీ హైదరాబాద్‌లో తమ కార్యాలయం ప్రారంభించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రైవేట్ క్రెడిట్ రంగంలోని ఓక్‌ట్రీ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కంపెనీ హైదరాబాద్‌లో తమ కార్యాలయం ప్రారంభించింది. దేశంలో కంపెనీకి ఇది రెండో కార్యాలయం. మొదటి కార్యాలయం ముంబైలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి 24 నగరాల్లో కార్యాలయాలుండగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 9 కార్యాలయాలున్నాయి. గత ఏడాది డిసెంబరు 31 నాటికి కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ 20,200 కోట్ల డాలర్లు. ఇదిలా ఉండగా అజయ్ మద్దాలి హైదరాబాద్ కార్యాలయానికి మానవ వనరుల డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
Updated Date - Mar 08 , 2025 | 02:56 AM