ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త ఉడాన్‌ పథకం

ABN, Publish Date - Feb 02 , 2025 | 03:28 AM

2016లో ప్రారంభించిన ఉడాన్‌ పథకం ఆశించిన మేర ఫలితాలు సాధించలేదనే విమర్శలు ఉన్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో కొత్త ఉడాన్‌ పథకాన్ని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణ సౌకర్యం....

  • 120 నూతన విమాన మార్గాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: 2016లో ప్రారంభించిన ఉడాన్‌ పథకం ఆశించిన మేర ఫలితాలు సాధించలేదనే విమర్శలు ఉన్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో కొత్త ఉడాన్‌ పథకాన్ని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా దేశంలో మరో 120 మార్గాల్లో విమాన ప్రయాణాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త ఉడాన్‌ పథకం ద్వారా దేశంలోని కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో చిన్న విమానాశ్రయాలు నిర్మించడంతో పాటు నూతన హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేయనున్నారు. నూతన ఉడాన్‌ పథకానికి రూ.540 కోట్ల కేటాయింపులు మాత్రమే చేసింది. గతేడాది ఇచ్చిన రూ.800 కోట్లతో పోల్చుకుంటే ఇది 32 శాతం తక్కువ.


డ్రోన్ల తయారీకి గత ఏడాది రూ. 33 కోట్లు ఇచ్చిన కేంద్రం ఈ సారి ఉత్పత్తి ఆధారిత పోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద రూ.57 కోట్లను కేటాయించింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు రూ. 302.64 కోట్లు, బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీకి రూ. 89 కోట్ల కేటాయింపులు చేసింది.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 03:28 AM