బీమా రంగంలో మరిన్ని సంస్కరణలు
ABN, Publish Date - Feb 19 , 2025 | 02:25 AM
బీమా రంగంలో మరిన్ని సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీల ఏజెంట్లు అవసరం ఉన్నా, లేకపోయినా మాయమాటలతో...
ఏడాదిలోగా పాలసీని వెనక్కి తీసుకునే స్వేచ్ఛ !
న్యూఢిల్లీ: బీమా రంగంలో మరిన్ని సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీల ఏజెంట్లు అవసరం ఉన్నా, లేకపోయినా మాయమాటలతో పాలసీదారులకు పాలసీలు అంటగట్టే పద్ధతికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పాలసీదారులు ఎలాంటి జరిమానా లేకుండా పాలసీ నుంచి తప్పుకునే స్వేచ్ఛను (ఫ్రీ లుక్ పీరియడ్) ఏడాదికి పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఇది నెల రోజులు మాత్రమే. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నాగరాజు ఈ విషయం తెలిపారు. గృహ రుణాల కోసం వచ్చే వ్యక్తులు లేదా రుణాల కోసం వచ్చే చిన్నచిన్న వ్యాపార సంస్థలకు ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఏదోలా ఏదో ఒక బీమా పాలసీని అంటగడుతున్నాయి. ఈ జాడ్యంపై ఎప్పటి నుంచే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Unemployment Rate: దేశంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగితపై కీలక నివేదిక..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
TCS Salary Hike: మార్చిలో టీసీఎస్‌లో
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 19 , 2025 | 02:25 AM