ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భాష, నిబంధనలు సరళం

ABN, Publish Date - Feb 13 , 2025 | 05:46 AM

ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపుదారులను గందరగోళానికి గురి చేస్తున్న అసె్‌సమెంట్‌ సంవత్సరం, గత సంవత్సరం వంటి పదాలు ఇక తెరమరుగు కానున్నాయి. గురువారం పార్లమెంటులో ప్రతిపాదించబోతున్న కొత్త ఐటీ బిల్లులో...

కాలం చెల్లిపోయిన నిబంధనలకు తిలోదకాలు

నేడే పార్లమెంటు ముందుకు కొత్త ఐటీ చట్టం

ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపుదారులను గందరగోళానికి గురి చేస్తున్న అసె్‌సమెంట్‌ సంవత్సరం, గత సంవత్సరం వంటి పదాలు ఇక తెరమరుగు కానున్నాయి. గురువారం పార్లమెంటులో ప్రతిపాదించబోతున్న కొత్త ఐటీ బిల్లులో ఆ పదాల స్థానంలో ‘‘ట్యాక్స్‌ సంవత్సరం’’ అనే పదం జోడించారు. ఏ సంవత్సరంలో అయినా ఏప్రిల్‌ 1 నుంచి తదుపరి సంవత్సరం మార్చి 31 వరకు విస్తరించి ఉండే 12 నెలల కాలాన్ని ఇక నుంచి ‘‘పన్ను సంవత్సరం’’గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఐటీ చట్టంలో అసె్‌సమెంట్‌ సంవత్సరం (ఏవై), గత సంవత్సరం (పీవై) అనే పదాలున్నాయి. 2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు వచ్చిన ఆదాయాన్ని 2025-26 అసె్‌సమెంట్‌ సంవత్సరంలో మదింపు చేసి పన్ను విధిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఐటీ చట్టం1961లో 298 సెక్షన్లు, 14 షెడ్యూల్స్‌ ఉండగా ప్రతిపాదిత కొత్త బిల్లు తగు మార్పులతో సరికొత్తగా రూపొందించిన 526 సెక్షన్లు, 23 అధ్యాయాలు, 16 షెడ్యూ ల్స్‌ కలిగి ఉంటుంది. మొత్తం పేజీల సంఖ్య 622. ప్రస్తుత చట్టంతో పోల్చితే పేజీల సంఖ్య సగం కన్నా తక్కువ ఉంటుంది. ఐటి చట్టం 1961ని రూపొందించినప్పుడు దానిలో 880 పేజీలున్నాయి.


భాష సరళతరం

అందరికి అర్ధమయ్యే విధంగా కొత్త బిల్లులో భాషను సరళం చేశారు. పాత చట్టంలో ఉపయోగించిన భాషలోని పలు సంక్లిష్ట పదాలు, వాక్యాలు తొలగించారు. సుదీర్ఘమైన వాక్యాలను కుదించారు. అంతగా ఉపయోగంలో లేని, అనవసరమైనవిగా భావిస్తున్న సెక్షన్లను కూడా తొలగించారు. ఇందుకు ఉదాహరణ ఫ్రింజ్‌ బెనిఫిట్‌ ట్యాక్స్‌. తేలిగ్గా చదువుకోవడానికి, వివరించేందుకు వీలుగా ‘‘నిబంధనలు లేదా వివరణల’’ను కూడా ఈ బిల్లులో తొలగించారు. ఐటీ చట్టం 1961లో నాట్‌విత్‌స్టాండింగ్‌ (అయినప్పటికీ) అనే పదం విరివిగా ఉపయోగంలో ఉంది. కొత్త బిల్లులో దాని స్థానంలో ‘‘ఇర్రెస్పెక్టివ్‌’’ అనే పదం ఉపయోగించారు. టీడీఎస్‌, ప్రిజంప్టివ్‌ టాక్సేషన్‌, వేతనాలు, మొండి బకాయిల మినహాయింపు వంటి అంశాల్లో నిబంధనల స్థానంలో పట్టికలు ప్రవేశపెట్టారు. అలాగే కొత్త బిల్లులో పొందుపరిచిన ‘‘పన్ను చెల్లింపుదారుల చార్టర్‌’’లో వారికి గల హక్కులు, బాధ్యతలు వివరించారు. పన్ను వివాదాలు గణనీయంగా తగ్గించడం లక్ష్యంగా ఎంప్లాయీస్‌ స్టాక్‌ ఆప్షన్లపై (ఇసాప్‌) పన్నులో మరింత స్పష్టత ఇచ్చారు. చట్టం సరళతరం చేయడం లక్ష్యంగా మొత్తం ఆదాయంలో భాగంగా పరిగణించని ఆదాయాన్ని షెడ్యూల్స్‌లోకి మార్చారు.


2026 ఏప్రిల్‌ 1

నుంచి అమలు

లోక్‌సభలో గురువారం బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అది ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు వెళ్తుంది. స్టాండింగ్‌ కమిటీ సమూలంగా పరిశీలించి, పార్లమెంటు ఆమోదించిన అనంతరం కొత్త బిల్లు 2026 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. గత ఆరు దశాబ్దాల కాలంలో ఐటీ చట్టం 1961కి పలు సవరణలు జరిగాయని, ఫలితంగా చట్టంలో సరళత్వం లోపించి సంక్లిష్టంగా మారిందని కొత్త ఐటీ బిల్లు ప్రతిపాదించడానికి కారణాలను వివరించే ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. ఐటీ శాఖ అధికారులు, ప్రాక్టీషనర్లు, పన్ను చెల్లింపుదారులు సైతం వీటిపై ఆందోళన ప్రకటించడంతో ఐటీ చట్టం 1961ని సమగ్రంగా సమీక్షించనున్నట్టు 2024 జూలై బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి సీబీడీటీ ఇంటర్నల్‌ కమిటీని నియమించింది. చట్టంలోని వివిధ అంశాలు పరిశీలించేందుకు మొత్తం 22 స్పెషలైజ్డ్‌ సబ్‌-కమిటీలు ఏర్పాటు చేశారు. భాష సరళీకరణ, లిటిగేషన్లు తగ్గింపు, కంప్లయెన్స్‌ భారం సడలింపు, కాలం చెల్లిపోయిను ఉపయోగంలో లేని నిబంధనల తొలగింపు అనే నాలుగు అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వివిధ వర్గాల నుంచి 6500 వరకు సలహాలు అందాయి.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 05:46 AM