‘ట్రంప్’ కార్డ్‌తో మార్కెట్లలో జోష్
ABN, Publish Date - Jan 21 , 2025 | 06:42 AM
ప్రపంచ మార్కెట్ల పటిష్ఠ సంకేతాల నడుమ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, పవర్ విభాగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఈక్విటీ మార్కెట్ సోమవారం లాభాల బాట పట్టింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో తాను టెలిఫోన్‌లో...
ముంబై: ప్రపంచ మార్కెట్ల పటిష్ఠ సంకేతాల నడుమ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, పవర్ విభాగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఈక్విటీ మార్కెట్ సోమవారం లాభాల బాట పట్టింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో తాను టెలిఫోన్‌లో సంభాషించానని, అది సానుకూల ఫలితం అందించిందని అమెరికా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపిం ది. టారి్‌ఫల పెంపు విషయంలో ట్రంప్ కాస్తంత సంయమనం పాటించి చర్చలకే మొగ్గు చూపవచ్చునన్న సంకేతంగా దీన్ని విశ్లేషకులు అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లన్నీ లాభాల్లో ట్రేడ్ కావడం దేశీయ మార్కెట్లో సెంటిమెంట్ పెరగడానికి దోహదపడింది. దీంతో సెన్సెక్స్ 454.11 పాయింట్ల లాభంతో 77,073.44 వద్ద ముగియగా నిఫ్టీ 141.55 పాయింట్ల లాభంతో 23,344.75 వద్ద ముగిసింది.
బిట్‌కాయిన్ @: 1.09 లక్షల డాలర్లు
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ పగ్గాలు చేపట్టబోతున్న నేపథ్యంలో బిట్‌కాయిన్ విలువ సోమవారం దూసుకుపోయింది. దాని విలువ 1,09,000 డాలర్లను తాకింది. ఒకప్పుడు క్రిప్టో కరెన్సీలను తీవ్రంగా వ్యతిరేకించిన ట్రంప్ తదుపరి తన వైఖరి మార్చుకుని ఇప్పుడు క్రిప్టో అనుకూల వైఖరి అనుసరిస్తున్నారు. దీంతో అధికార పగ్గాలు చేపట్టగానే ఆయన డిజిటల్ కరెన్సీలను ప్రోత్సహించే చర్యలు తీసుకోవచ్చునన్న ఆశలు బిట్‌కాయిన్ పరుగులు తీయడానికి దోహదపడినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ తన క్యాబినెట్ సహచరులుగాను, నియంత్రణా సంస్థల అధిపతులుగాను క్రిప్టో మద్దతుదారులకే పట్టం కట్టడంతో శుక్రవారం 5ు లాభపడిన బిట్‌కాయిన్ సోమవారం 9,000 డాలర్లకు పైగా దూసుకుపోయి 1,09,000 డాలర్లు పలికింది.
Updated Date - Jan 21 , 2025 | 06:42 AM