పన్ను ఎగవేతదారులపై ఐటీ నజర్
ABN, Publish Date - Feb 27 , 2025 | 04:42 AM
గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2022-23, 2023-24) పన్ను మినహాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న 40,000 మంది పన్ను చెల్లింపుదారులపై...
న్యూఢిల్లీ: గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2022-23, 2023-24) పన్ను మినహాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న 40,000 మంది పన్ను చెల్లింపుదారులపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. టీడీఎస్ (మూలస్థానంలో పన్ను వసూలు) క్లెయిమ్స్‌లో అవకతవకతలను గుర్తించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సమగ్రమైన 16 అంచెల వ్యూహాన్ని రూపొందించింది. అనుమానిత పన్ను చెల్లింపుదారుల ఐటీ రిటర్నులను పునఃసమీక్షించేందుకు ఆదాయపు పన్ను శాఖకు చెందిన డేటా అనలిటిక్స్ బృందం ఇప్పటికే జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. తొలుత వారికి నోటీసు పంపి, వారి రిటర్నుల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఓ అవకాశం ఇవ్వనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తరచుగా ఇలాంటి తప్పులకు పాల్పడుతున్నవారిపై, ముఖ్యంగా ముందస్తు పన్ను చెల్లింపులు- పన్ను మినహాయింపుల్లో వ్యత్యాసం ఉన్న కేసులు, మినహాయింపుదారు వివరాల్లో తరచుగా సవరణలు జరుగుతున్న సందర్భాలపై ఐటీ డిపార్ట్‌మెంట్ ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 27 , 2025 | 04:42 AM