ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐపీఓల సొమ్ము దుర్వినియోగమవుతోంది..

ABN, Publish Date - Jan 22 , 2025 | 03:23 AM

పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్‌పై క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఓల ద్వారా సేకరించిన నిధులను...

  • ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్లూ జర జాగ్రత్త

  • లిస్టింగ్‌కు ముందే ఐపీఓ షేర్లలో ట్రేడింగ్‌

  • సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌

ముంబై: పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్‌పై క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఓల ద్వారా సేకరించిన నిధులను కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. ఇలాంటి కంపెనీలు అసలు ఐపీఓ మార్కెట్‌కే రాకుండా ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్లు కట్టడి చేయాలని కోరారు. ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీఏఐ) నిర్వహించిన ఒక సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కాలంలో ఐపీఓలు జారీ చేసిన కొన్ని కంపెనీల షేర్లు వందల రెట్లు సబ్‌స్ర్కైబ్‌ కావడం, భారీ లాభాలతో లిస్టింగ్‌ కావడం, తర్వాత నీరుగారి పోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెబీ చీఫ్‌ బుచ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇలాంటి కంపెనీలను ఆమె ‘పంప్‌ అండ్‌ డంప్‌’ కంపెనీలుగా వర్ణించారు. దీనికి చెక్‌ పెట్టేందుకు లిస్టింగ్‌కు ముందే ఐపీఓ షేర్లలో ట్రేడింగ్‌ను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.


అసాధారణ దుర్వినియోగం: భారీ లాభాలతో లిస్టయిన వెంటనే పంప్‌ అండ్‌ డంప్‌ కంపెనీల ప్రమోటర్లు తమ వాటా షేర్లనూ భారీ లాభాలకు విక్రయించడాన్ని గుర్తు చేశారు. ఈ భారీ లాభాలను వారు తమకు సంబంధించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు తరలించుకు పోతున్నారన్నారు లేదా వ్యాపార అభివృద్ధి కోసం విదేశాల్లో ఏదో ఒక అల్లాటప్పా కంపెనీని లేదా యాప్‌ను కొనుగోలుకు వినియోగించినట్టు నాటకాలు వేస్తున్నట్టు తెలిపారు. వచ్చే రెండేళ్లలో దాదాపు వెయ్యికిపైగా కంపెనీలు నిధుల సేకరణ కోసం ఐపీఓలు జారీ చేయనున్నాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Updated Date - Jan 22 , 2025 | 03:23 AM