IPO News: ఇన్నోవేటివ్యూ ఇండియా లిమిటెడ్.. రూ. 2,000 కోట్లు సమీకరణకు రంగం సిద్ధం..
ABN, Publish Date - Feb 16 , 2025 | 04:01 PM
దేశవ్యాప్తంగా పరీక్షలు, ఎలక్షన్లు మొదలైన భారీ కార్యక్రమాలకు ఆటోమేటెడ్ యాన్సిలరీ సెక్యూరిటీ, సర్వైలెన్స్ సొల్యూషన్స్ అందిస్తున్న టెక్ ఆధారిత కంపెనీ ఇన్నోవేటివ్యూ ఇండియా లిమిటెడ్ ఐపీఓకు సిద్ధమవుతోంది.
దేశవ్యాప్తంగా పరీక్షలు, ఎలక్షన్లు మొదలైన భారీ కార్యక్రమాలకు ఆటోమేటెడ్ యాన్సిలరీ సెక్యూరిటీ, సర్వైలెన్స్ సొల్యూషన్స్ అందిస్తున్న టెక్ ఆధారిత కంపెనీ ఇన్నోవేటివ్యూ ఇండియా లిమిటెడ్ (Innovatiview India Limited) ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదాను (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓ కింద ఆఫర్ ఫర్ సేల్ (OFS) మార్గంలో షేర్లను విక్రయించడం ద్వారా రూ. 2,000 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది.
దేశీయంగా ఎగ్జామినేషన్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే ``ఇన్నోవేటివ్యూ`` దేశంలోనే అతి పెద్ద కంపెనీగా నిలిచింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 73.7 శాతం మార్కెట్ వాటాతో ప్రథమ స్థానంలో నిలిచింది. త్వరలోనే ఈ ఐపీఓకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రాబోతున్నాయి. డీఏఎమ్ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, షనాన్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ``ఇన్నోవేటివ్ వ్యూ`` ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Feb 16 , 2025 | 04:01 PM