హెచ్‌యూఎల్ లాభం రూ.2989 కోట్లు
ABN, Publish Date - Jan 23 , 2025 | 06:15 AM
హిందుస్తాన్ యునీలీవర్ కంపెనీ డిసెంబరు 31వ తేదీతో ముగిసిన మూడో త్రైమాసికంలో 19.18 శాతం వృద్ధితో రూ.2989 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది. ప్యూరిట్ వ్యాపార విభాగం విక్రయం లాభాల వృద్ధికి...
హిందుస్తాన్ యునీలీవర్ కంపెనీ డిసెంబరు 31వ తేదీతో ముగిసిన మూడో త్రైమాసికంలో 19.18 శాతం వృద్ధితో రూ.2989 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది. ప్యూరిట్ వ్యాపార విభాగం విక్రయం లాభాల వృద్ధికి దోహదపడిందని కంపెనీ వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.2508 కోట్ల లాభం ఆర్జించింది. ఇదే కాలంలో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.15,781 కోట్ల నుంచి రూ.16,050 కోట్లకు పెరిగింది. త్రైమాసికంలో మొత్తం వ్యయాలు రూ.12,576 కోట్లుగా నమోదయ్యాయి.
అప్‌రైజింగ్ సైన్స్ కొనుగోలు: ప్రీమియం బ్యూటీ బ్రాండ్ మినిమలిస్ట్ యాజమాన్య సంస్థ అప్‌రైజిం గ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 90.5 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్టు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ జావా తెలిపారు. రూ.2,955 కోట్ల అంచనా విలువతో రూ.2,670 కోట్ల నగదు చెల్లింపు ప్రాతిపదికన కంపెనీని కొనుగోలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. మరో రెండు సంవత్సరాల కాలంలో మిగతా వాటాలు కూడా కొనుగోలు చేస్తామన్నారు. కాగా ఐస్‌క్రీమ్ వ్యాపారం క్వాలిటీ వాల్స్ (ఇండియా) లిమిటెడ్ డీ మెర్జర్‌కు డైరెక్టర్ల బోర్డు అనుమతించిందని ఆయన తెలిపారు.
Updated Date - Jan 23 , 2025 | 06:15 AM