ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HUL : హెచ్‌యూఎల్‌ గూటికి మినిమలిస్ట్‌!

ABN, Publish Date - Jan 04 , 2025 | 06:10 AM

దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) భారీ కొనుగోలుకు సిద్ధమైనట్లు తెలిసింది. జైపూర్‌కు చెందిన స్కిన్‌కేర్‌ ఉత్పత్తుల స్టార్టప్‌

డీల్‌ విలువ రూ.3,000 కోట్లు

న్యూఢిల్లీ: దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) భారీ కొనుగోలుకు సిద్ధమైనట్లు తెలిసింది. జైపూర్‌కు చెందిన స్కిన్‌కేర్‌ ఉత్పత్తుల స్టార్టప్‌ మినిమలి్‌స్టను టేకోవర్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ డీల్‌ విలువ రూ.3,000 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ పీక్‌ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్‌ పెట్టుబడులు కలిగిన మినిమలిస్ట్‌.. గతంలో హెచ్‌యూఎల్‌ మాతృసంస్థ యూనిలీవర్‌కు చెందిన పెట్టుబడి విభాగమైన యూనిలీవర్‌ వెంచర్స్‌ నుంచి రూ.110 కోట్లు సమీకరించింది. చర్మ సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్లో మినిమలిస్ట్‌ అనతికాలంలోనే ప్రముఖ బ్రాండ్‌గా ఎదిగింది. 2022 -23లో రూ.184 కోట్లుగా నమోదైన ఈ స్టార్టప్‌ ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 89 శాతం వృద్ధితో రూ.350 కోట్లకు పెరిగింది.

Updated Date - Jan 04 , 2025 | 06:10 AM