పీఎ్‌సబీల్లో తగ్గనున్న ప్రభుత్వ వాటా
ABN, Publish Date - Feb 25 , 2025 | 02:08 AM
కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) మరో విడత పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈక్విటీలో 25 శాతం కంటే...
మరిన్ని వాటాల విక్రయానికి సన్నాహాలు
మర్చంట్ బ్యాంకర్ల నుంచి బిడ్స్ ఆహ్వానం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) మరో విడత పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈక్విటీలో 25 శాతం కంటే తక్కువ పబ్లిక్ ఫ్లోటింగ్ ఉన్న లిస్టెడ్ ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ), ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల (పీఎ్‌ఫఐ) నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు అవసరమైన సేవలు అందించే మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సేవల సంస్థలు వచ్చే నెల 27లోగా తమ ప్రతిపాదనలు అందజేయాలని కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ప్రభుత్వ ఆస్తులు, పెట్టుబడుల నిర్వహణ శాఖ (దీపమ్) దీనికి సంబంధించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంపిక చేసిన సంస్థలు మూడేళ్ల పాటు ప్రభుత్వానికి ఈ విషయంలో సేవలు అందించాలి.
ఒకవేళ అవసరమనుకుంటే ఈ గడువును మరో ఏడాది పొడిగిస్తారు. లిస్టెడ్ పీఎ్‌సబీలు, పీఎ్‌ఫఐలు వచ్చే ఏడాది ఆగస్టు 1లోగా తమ ఈక్విటీలో 25 శాతం పబ్లిక్ ఫ్లోటింగ్ ఉండేలా చూసుకోవాలని సెబీ ఆదేశించింది. దీంతో స్టాక్ మార్కెట్ కోలుకున్న వెంటనే ఈ పని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి:
Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్
OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 25 , 2025 | 02:08 AM