Gold Rates Today: పసిడి కొనేందుకు తగిన సమయం.. స్వల్పంగా తగ్గిన ధరలు
ABN, Publish Date - Feb 28 , 2025 | 07:05 AM
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే, వచ్చే వారం బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి నేటి బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం.
పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.10 మేర తగ్గి రూ. 87,380కి చేరుకుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.80,100 నుంచి రూ.80,090కు చేరింది. ఇక వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. నిన్న కిలో వెండి ధర రూ.98,000 కాగా నేడు రూ.97,900కు చేరుకుంది.
దేశంలోని వివిధ నగరాల్లో 24 క్యారెట్ ధరలు ఎలా ఉన్నాయంటే..
చెన్నై రూ. 87,370
ముంబై రూ.87,370
ఢిల్లీ రూ. 87,520
కోల్‌కతా రూ.87,370
హైదరాబాద్ రూ.87,370
బెంగళూరు రూ87,370
అహ్మదాబాద్ రూ.87,420
ఇక వచ్చే ఏడు రోజుల వ్యవధిలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.84,490గా ఉండా ప్రస్తుతం ఇది రూ.87,370కు చేరుకుంది. ఫిబ్రవరి 25న అత్యధికంగా రూ.88090కు చేరింది. ఫిబ్రవరి 3న అత్యల్పంగా 84,050ను తాకింది. అంతర్జాతీయ పరిస్థితులు, డిమాండ్-సరఫరాల్లో తేడాలు వంటివన్నీ పసిడి ధరలను ప్రభావితం చేస్తాయన్న విషయం తెలిసిందే.
Updated Date - Feb 28 , 2025 | 07:21 AM