ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold rates today: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN, Publish Date - Mar 08 , 2025 | 07:16 AM

నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే, ట్రంప్ సుంకాల నుంచి స్వల్ప ఊరట లభించిన నేపథ్యంలో వచ్చే వారమంతా బంగారం ధరలో స్వల్ప హెచ్చుతగ్గులు మాత్రమే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? లేదా శుభకార్యాలకు బంగారు నగలు కొనాలనుకుంటున్నారా? అయితే..ఇందుకు ఇదే సరైన సమయం! నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గతంలో 10 గ్రాముల బంగారం ధర రూ.86,380 ఉండగా ప్రస్తుతం రూ.86,120కి చేరుకుంది. వెండి ధరలో కూడా కోత పడింది. కిలో వెండి ప్రస్తుతం రూ.97,380గా ఉంది (Gold rates today in India).

Gold Crossing 1 lakh: ఈ సంవత్సరం బంగారం ధర లక్ష మార్కు దాటుతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే) ఇవే..

న్యూఢిల్లీ: రూ.85,820; రూ.78,668

ముంబై: రూ.85,970; రూ.78,806

కోల్‌కతా: రూ.85,850; రూ.78,696

చెన్నై: రూ.86,220; రూ.79,035

బెంగళూరు: రూ.86,030; రూ.78,861

హైదరాబాద్: 86,100; రూ.78,925

అహ్మదాబాద్: రూ.86,080; రూ.78,907

పూణె: రూ.85,970; రూ.78,806;


ఇక వచ్చే వారం కూడా బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు మినహా భారీ మార్పులు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్ సుంకాల భయం నుంచి తాత్కాలిక ఊరట లభించడం వంటివి స్వల్ప కాలికగా ధరల పెరుగుదలను అడ్డుకుంటాయని అంటున్నారు. మార్కె్ట్‌లో బంగారం ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ, ప్రభుత్వ విధానాలు, నిబంధనలు, ఆర్థీక రంగంలో మార్పులు వంటివన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అయితే, బంగారం ధరలు పెరిగిన సందర్భంలో ఎక్కువ మొత్తం గోల్డ్ లోన్స్ లభిస్తాయి. ఇక బంగారం ధర తగ్గిన సందర్భాల్లో ఈ లోన్‌ను త్వరగా తీర్చేసే అవకాశం చిక్కుతుంది.

Read Latest and Business News

Updated Date - Mar 08 , 2025 | 08:38 AM