Manufacturing Mission : ‘తయారీ’కి పెద్దపీట
ABN, Publish Date - Feb 02 , 2025 | 05:43 AM
‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ఇందుకోసం జాతీయ తయారీ మిషన్ (ఎన్‌ఎంఎం) పేరుతో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య విధానాలను సులభతరం చేయడం, ఖర్చులు తగ్గించడం, భవిష్యత్ అవసరాలకు
ఎన్‌ఎంఎం పేరుతో ప్రత్యేక మిషన్
‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ఇందుకోసం జాతీయ తయారీ మిషన్ (ఎన్‌ఎంఎం) పేరుతో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య విధానాలను సులభతరం చేయడం, ఖర్చులు తగ్గించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుగానే ఉద్యోగులను సిద్ధం చేయడం, అవసరాలకు తగ్గట్టు క్రియాశీలకంగా స్పందించేలా ఎంఎ్‌సఎంఈలను ప్రోత్సహించడం, టెక్నాలజీ అందుబాటు, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలన్నారు. చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎస్‌ఎంఈ)తో పాటు పెద్ద తరహా కంపెనీలూ ఈ మిషన్ పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ మిషన్ ద్వారా తయారీ రంగంలో ఉన్న కంపెనీలకు విధానపరమైన మద్దతుతో పాటు నిర్వహణపరమైన సేవలు అందుతాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా మన దేశ తయారీ రంగాన్ని అనుసంధానం చేయడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యమన్నారు.
ఎగుమతులకు ప్రోత్సాహం
మన దేశం నుంచి ఎగుమతుల ప్రోత్సాహానికి ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ బడ్జెట్‌లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఎగుమతుల ప్రోత్సహాక మిషన్ (ఈపీఎం) పేరుతో మరో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మిషన్ కోసం రూ.2,250 కోట్లు కేటాయించారు. కేంద్ర ఆర్థిక, వాణిజ్య, ఎంఎ్‌సఎంఈల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ మిషన్‌ను నిర్వహిస్తాయి. ఎగుమతిదారులకు తేలిగ్గా రుణాలు అందేందుకు, విదేశాల వాణిజ్యేతర సుంకాల భారం మన ఎగుమతులపై పడకుండా ఉండేందుకు కూడా ఈ మిషన్ దేశీయ కంపెనీలకు సహకరిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల డాక్యుమెంటేషన్, ఆర్థిక అవసరాల కోసం ‘భారత్ ట్రేడ్‌నెట్ (బీటీఎన్) పేరుతో ప్రభుత్వ రంగంలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఈ భారత్ ట్రేడ్ నెట్ ప్రాజెక్టు ఉంటుందన్నారు.
ఇవీ చదవండి:
ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి
కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 02 , 2025 | 05:43 AM