ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో ఎజిలీసియం ‘జీసీసీ’

ABN, Publish Date - Feb 27 , 2025 | 04:46 AM

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేస్తోంది. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా కంపెనీలకు...

2,000 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేస్తోంది. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా కంపెనీలకు జనరేటివ్‌ ఏఐ ఆధారిత వినూత్న డేటా అనలిటికల్‌ సేవలందించే అమెరికా కంపెనీ ఎజిలీసియం ‘లైఫ్‌ సైన్సెస్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టాలెంట్‌ డెవల్‌పమెంట్‌ లాబ్‌’ పేరుతో ఈ జీసీసీని ఏర్పాటు చేస్తోది. ఇందుకోసం ఇప్పటికే బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌ రంగాలకు చెందిన 50 మంది నిపుణుల నియామకాలు పూర్తి చేసినట్టు కంపెనీ వ్యవస్థాపకులు, సీఈఓ రాజబాబు ‘బయో ఏషియా, 2025’ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. 2027 నాటికి తమ హైదరాబాద్‌ జీసీసీలో 2,000 ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీల పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు, వాటి అమ్మకాలు, మార్కెటింగ్‌కు జెనరేటివ్‌ ఏఐ ఆధారిత వినూత్న డేటా సేవలందించడం ఎజిలిసిఎం కంపెనీ ప్రత్యేకత. మౌలిక సదుపాయాలతో పాటు నిపుణులైన ఉద్యోగుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో తమ జీసీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రాజబాబు చెప్పారు. ప్రస్తుతం తమకు ఉన్న యాభైకి పైగా క్లయింట్లలో 10 నుంచి 20 శాతం భారతీయ కంపెనీలన్నారు.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..


Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 27 , 2025 | 04:46 AM