2024-25 Forecast : స్టాక్ మార్కెట్లో దిద్దుబాటు పొంచి ఉంది
ABN, Publish Date - Feb 01 , 2025 | 04:42 AM
దేశీయ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్లపై 2024-25 ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కొంత దిద్దుబాటు జరిగినా.. మన స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఇంకా అధికంగానే ఉన్నట్టు స్పష్టం చేసింది. అమెరికా స్టాక్ మార్కెట్ ఏమాత్రం దిద్దుబాటు (కరెక్షన్)కు లోనైనా, మన స్టాక్
యువ మదుపరులూ జర జాగ్రత్త
అమెరికా మునిగితే మనమూ మునుగుతాం
దేశీయ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్లపై 2024-25 ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కొంత దిద్దుబాటు జరిగినా.. మన స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఇంకా అధికంగానే ఉన్నట్టు స్పష్టం చేసింది. అమెరికా స్టాక్ మార్కెట్ ఏమాత్రం దిద్దుబాటు (కరెక్షన్)కు లోనైనా, మన స్టాక్ మార్కెట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో దిద్దుబాటుకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రిటైల్ మదుపరులు ముఖ్యంగా 2020 కొవిడ్ సమయం నుంచి కొత్తగా పెట్టుబడులు ప్రారంభించిన యువ మదుపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. లేకపోతే నిండా మునగడం ఖాయమని హెచ్చరించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో దేశీయ సంస్థాగత ముదుపరులు, రిటైల్ మదుపరుల పాత్ర పెరిగినా, సెంటిమెంట్‌పరంగా మన మార్కెట్‌తో పాటు అనేక దేశాల స్టాక్ మార్కెట్లు ఇప్పటికీ అమెరికా మార్కెట్‌తో ముడిపడి ఉన్న విషయాన్ని ఆర్థిక సర్వే గుర్తు చేసింది.
13.2 కోట్ల మంది మదుపరులు
దేశీయ స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న రిటైల్ మదుపరుల పాత్రనీ ఆర్థిక సర్వే గుర్తు చేసింది. 2019లో స్టాక్ మార్కెట్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేసిన రిటైల్ మదుపరుల సంఖ్య 4.9 కోట్లు ఉంటే, 2024 డిసెంబరు నాటికి ఇది 13.2 కోట్లకు పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. గత ఐదేళ్లలో దేశీయ స్టాక్ మార్కెట్లో కుటుంబాల పెట్టుబడుల విలువ రూ.40 లక్షల కోట్లకు పైగా పెరిగినట్టు తెలిపింది. కంపెనీల ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు, ఆర్థిక వ్యవస్థ జోరు మీద ఉండడం, ఆన్‌లైన్ డిజిటల్ ఇన్వె్‌స్టమెంట్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి రావడం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. డీమ్యాట్ ఖాతాల పరంగా చూసినా గత ఐదేళ్లలో ఏటా సగటున 33 శాతం చొప్పున పెరుగుతూ డిసెంబరు, 2024 నాటికి 18.5 కోట్లకు చేరిన విషయాన్నీ గుర్తు చేసింది. ఈక్విటీ క్యాష్ విభాగంలోనూ రిటైల్ మదుపరుల లావాదేవీల వాటా 35.6 శాతం నుంచి 41 శాతానికి చేరినట్టు తెలిపింది.
ప్రైౖవేట్ పెట్టుబడులు పెరగాలి
2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలంటే, కేవలం ప్రభుత్వ పెట్టుబడులు మాత్రమే చాలవని స్పష్టం చేసింది. ఇందుకు ప్రైవేట్ పెట్టుబడులూ పెద్దఎత్తున అవసరమని పేర్కొంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానమూ ఇందుకు ఉపకరిస్తుందని తెలిపింది. అధిక వృద్ధి రేటు కొనసాగించాలన్నా, మరో 20 ఏళ్ల పాటు మన దేశం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుపైన పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 01 , 2025 | 04:42 AM