ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Economic Survey Predicts : ధరలు దిగొస్తాయి!

ABN, Publish Date - Feb 01 , 2025 | 04:47 AM

వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.3-6.8 శాతం శ్రేణిలో నమోదు కావచ్చని 2024-25 ఆర్థిక సర్వే నివేదిక అంచనా వేసింది. బలమైన ఆర్థిక మూలాలు, ఆర్థిక స్థిరీకరణ, నిలకడైన ప్రైవేటు వినియోగం ఇందుకు దోహదపడనున్నాయని సర్వే పేర్కొంది. అయితే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు

కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3-6.8% వృద్ధి

ధరలు దిగొస్తాయి!

కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం

మార్చి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3-6.8% వృద్ధి

2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు 8% వృద్ధి అవసరం

పెట్టుబడులను జీడీపీలో 35 శాతానికి పెంచాలి

ఏఐ, రోబోటిక్స్‌, బయోటెక్నాలజీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు

2030-32 వరకు ఏటా 78.5 లక్షల కొత్త కొలువుల్ని సృష్టించాలి

దేశంలో వ్యాపార నిర్వహణను ఇంకా సులభతరం చేయాలి

ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పించిన మంత్రి సీతారామన్‌

నేడే కేంద్ర బడ్జెట్‌.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నిర్మల

2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు 8ు వృద్ధి అవసరం

ఇందుకు నియంత్రణ సడలింపులతో పాటు భూ, కార్మిక సంస్కరణలు చేపట్టాలి..

పెట్టుబడులను జీడీపీలో 35%కి పెంచాలి..

ఏఐ, రోబోటిక్స్‌, బయోటెక్నాలజీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి..

తయారీని మరింత ప్రోత్సహించాలి..

వ్యాపార నిర్వహణను సులభతరం చేయాలి

ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పించిన ఆర్థిక మంత్రి సీతారామన్‌

కూరగాయల ధరలు తగ్గడంతోపాటు ఖరీఫ్‌ పంట చేతికి రానుండటంతో మార్చి చివరి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టనుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. గ్రామీణ మార్కెట్‌ గిరాకీ, పెరిగిన పంట దిగుబడి స్వల్పకాలిక వృద్ధికి దోహదపడనున్నాయని పేర్కొంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలంటే వచ్చే రెండు దశాబ్దాలపాటు 8% వార్షిక వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. దీనికోసం తయారీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని, కృత్రిమమేధ, రోబోటిక్స్‌, బయో టెక్నాలజీ రంగాల్లో విస్తృత పెట్టుబడులు అవసరమని సూచించింది. 2030-32 వరకు వ్యవసాయేతర రంగాల్లో 78.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సి ఉందని పేర్కొంది. 2024-25లో జీడీపీ వృద్ధి రేటు 6.3-6.8% మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.3-6.8 శాతం శ్రేణిలో నమోదు కావచ్చని 2024-25 ఆర్థిక సర్వే నివేదిక అంచనా వేసింది. బలమైన ఆర్థిక మూలాలు, ఆర్థిక స్థిరీకరణ, నిలకడైన ప్రైవేటు వినియోగం ఇందుకు దోహదపడనున్నాయని సర్వే పేర్కొంది. అయితే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు అవసరమైన వృద్ధి కంటే ఇది చాలా తక్కువని అభిప్రాయపడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌లో ‘ఆర్థిక సర్వే 2024-25’ నివేదికను సమర్పించారు. దేశ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను తెలిపే ఈ వార్షిక నివేదికను ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ పర్యవేక్షణలో ఆర్థిక వ్యవహారాల శాఖ తయారు చేసింది. ఆర్థిక సర్వే నివేదికను తొలిసారిగా 1950-51లో రూపొందించారు. అప్పట్లో బడ్జెట్‌తో కలిపి దీన్ని సమర్పించేవారు. 1960 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌కు ముందు రోజు ఈ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించడం ప్రారంభించింది.


ఈ మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి 6.4 శాతానికి పరిమితం కావచ్చని కేంద్ర గణాంక శాఖ ఇప్పటికే ముందస్తు అంచనాలను విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎకనామిక్‌ సర్వే అంచనా వేసిన 6.3-6.8 శాతం వృద్ధి శ్రేణిలో దిగువ స్థాయి ఈసారి కంటే తక్కువ. అంటే, వచ్చే ఏడాది వృద్ధి మరింత బలహీనపడే అవకాశాలున్నాయనడానికిదే సంకేతం. అంతేకాదు, కొవిడ్‌ సంక్షోభం అనంతరం భారత్‌కు ఇదే కనిష్ఠ వృద్ధి రేటు కానుంది. గ్రామీణ మార్కెట్‌ గిరాకీ, పెరిగిన పంట దిగుబడి, తగ్గుముఖం పడుతున్న ఆహార ధరలు, స్థిరమైన ఆర్థిక మూలాలు స్వల్పకాలిక వృద్ధికి దోహదపడనున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశ్చితులతోపాటు కమోడిటీల ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఆర్థికాభివృద్ధికి అవరోధంగా పరిణమించే ప్రమాదం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ హెచ్చరించారు.

ఆహార ధరలు తగ్గుముఖం

కూరగాయల ధరలు కాస్త తగ్గడంతో పాటు ఖరీఫ్‌ పంట చేతికి రానుండటంతో ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆహార ధరల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టవచ్చని, తద్వారా సామాన్యులకు ధరాఘాతం నుంచి కొంత ఊరట లభించవచ్చని ఆర్థిక సర్వే నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. రబీ పంట దిగుబడి కూడా మెరుగ్గా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లోనూ ఆహార ధరలు అందుబాటులోనే ఉండవచ్చని రిపోర్టు పేర్కొంది. ఆహార ధరలకు కళ్లెం వేసేందుకు పర్యావరణ ప్రతికూలతలను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడంతోపాటు పప్పు దినుసులు, వంటనూనె గింజలు, టమోట, ఉల్లి దిగుబడిని పెంచాలని ఆర్థిక సర్వే నివేదిక సూచించింది.

వేగవంత వృద్ధి కోసం ప్రపంచ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకునేందుకు భారత్‌ సదా సిద్ధంగా ఉండాలి. దేశంలో ప్రస్తుత వృద్ధి మందగమనానికి అంతర్జాతీయ అనిశ్చితులు, ప్రతికూలతలే కారణం. అయినప్పటికీ, భారత్‌ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న బడా ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.

- అనంత నాగేశ్వరన్‌, ప్రధాన ఆర్థిక సలహాదారు


వచ్చే 2 దశాబ్దాలు వడివడిగా..

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు 8 శాతం వార్షిక వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఆర్థిక వృద్ధిని ప్రేరేపించేందుకు నియంత్రణ సడలింపులతో పాటు భూ, కార్మిక, బిల్డింగ్‌, యుటిలిటీ సేవలు, ప్రజా సేవల రంగాల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అంతేకాదు, పెట్టుబడులను జీడీపీలో ప్రస్తుతమున్న 31 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని.. దేశంలో తయారీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని, కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌, బయోటెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అలాగే, 2030-32 వరకు వ్యవసాయేతర రంగాల్లో ఏటా 78.5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉందని, దేశంలో 100 శాతం అక్షరాస్యతను సాధించడంతో పాటు విద్యా సంస్థల ప్రమాణాలను పెంచాలని, అత్యంత నాణ్యమైన, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణమైన మౌలిక వసతులను త్వరితగతిన అభివృద్ధి చేయాలని కోరింది. అంతేకాదు, దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరంగా మార్చాలని.. ఈ విడత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపట్టాలని, నియమావళిని సడలించాలని సూచించింది. కేంద్రం, రాష్ట్రాలు సంస్కరణలను కొనసాగిస్తేనే భారత్‌ భవిష్యత్‌ లక్ష్యాలకు అవసరమైన వృద్ధిని సాధించగలదని సర్వే నివేదిక పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:47 AM