ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold prices : తగ్గనున్న పసిడి ధర!

ABN, Publish Date - Feb 01 , 2025 | 04:39 AM

ఈ సంవత్సరం బులియన్‌ మార్కెట్‌ ధరలు మిశ్రమంగా ఉంటాయని ఆర్థిక సర్వే అంచనా. పసిడి ధర తగ్గినా, వెండి ధర మాత్రం మరింత కొండెక్కుతుందని స్పష్టం చేసింది.

వెండి మాత్రం పైపైకి

ఈ సంవత్సరం బులియన్‌ మార్కెట్‌ ధరలు మిశ్రమంగా ఉంటాయని ఆర్థిక సర్వే అంచనా. పసిడి ధర తగ్గినా, వెండి ధర మాత్రం మరింత కొండెక్కుతుందని స్పష్టం చేసింది. ఒక్క వెండి తప్ప మిగతా లోహాలు, ఖనిజాల ధరలు కూడా ఈ సంవత్సరం దిగొస్తాయని అంచనా వేసింది. రష్యా చమురు ఎగుమతులపై ఎన్ని ఆంక్షలు విధించినా ఈ సంవత్సరం ముడి చమురు ధరల పతనం తప్పదని స్పష్టం చేసింది. అయితే సహజ వాయువు ధర మాత్రం కొద్దిగా పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇనుప ఖనిజం, జింక్‌ ధరల పతనం ఈ సంవత్సరం ఖనిజాలు, లోహాల మార్కెట్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. చమురు, బంగారం ధరల తగ్గుదల ఈ సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థకు కలిసి రానుందని సర్వే పేర్కొంది.

అధిక ద్రవ్యీకరణతో అనర్థమే

ప్రజల పొదుపులో ఎక్కువ భాగం స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, రుణ పత్రాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులుగా మారడంపైనా ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్యీకరణ పెట్టుబడులుగా భావించే ఈ స్పెక్యులేషన్‌ పెట్టుబడులు ఒక స్థాయికి మించి పెరిగితే ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి గానీ, వ్యక్తుల ఆర్థిక స్థిరత్వానిగానీ ఏ మాత్రం మంచిది కావని స్పష్టం చేసింది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, జపాన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ లోపాలు కనిపిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. మనలాంటి వర్థమాన దేశాలకు ఇది మరింత ప్రమాదకరమని హెచ్చరించింది.


సమిష్ఠి కృషితోనే ‘తయారీ’ హబ్‌

తయారీ రంగంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నాలపైనా ఆర్థిక సర్వే ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగం, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, ఆర్థిక సంస్థలు చేతులు కలిపితే తప్ప.. ఈ లక్ష్య సాధన సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం చైనా తన భారీ ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రపంచ దేశాలను ముంచెత్తుతోంది. ఈ దెబ్బకు తట్టుకోలేక భారత్‌తో సహా అనేక దేశాల పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే చేసిన ఈ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి:

Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News


Updated Date - Feb 01 , 2025 | 04:39 AM