ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎట్టకేలకు నష్టాలకు తెర

ABN, Publish Date - Mar 06 , 2025 | 04:12 AM

రిలీఫ్‌ ర్యాలీతో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంచి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 740.30 పాయింట్ల లాభంతో 73,730.23 వద్ద, నిఫ్టీ 254.65 పాయింట్ల లాభంతో...

రిలీఫ్‌ ర్యాలీతో రూ.7.97 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: రిలీఫ్‌ ర్యాలీతో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంచి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 740.30 పాయింట్ల లాభంతో 73,730.23 వద్ద, నిఫ్టీ 254.65 పాయింట్ల లాభంతో 22,337.30 వద్ద ముగిశాయి. దీంతో గత పది రోజుల నిఫ్టీ నష్టాలకు బ్రేక్‌ పడింది. ఈ రిలీఫ్‌ ర్యాలీతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ బుధవారం రూ.7.97 లక్షల కోట్లు పెరిగి రూ.393.04 లక్షల కోట్లకు చేరింది. యుటిలిటీస్‌, పవర్‌, సర్వీసెస్‌, మెటల్‌, టెలికాం, కమోడిటీస్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీల షేర్లకు పెద్ద ఎత్తున కొనుగోళ్ల మద్దతు లభించడం, ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు మంచి లాభాలతో ట్రేడవడం; మెక్సికో, కెనడాలపై విధించిన సుంకాలపై అమెరికా పునరాలోచిస్తోందన్న వార్తలు ఇందుకు తోడయ్యాయి. ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్‌ మారకం రేటు బలహీనపడడం కూడా ఇందుకు కలిసొచ్చింది. అయితే ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం దీర్ఘకాలిక ప్రభావంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. దీంతో ఈ రిలీఫ్‌ ర్యాలీ ఎన్నాళ్లు కొనసాగుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఎక్సెల్‌సాఫ్ట్‌ నుంచి

రూ.700 కోట్ల ఐపీఓ!

మైసూరు కేంద్రంగా పనిచేసే ఎక్సెల్‌సాఫ్ట్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రూ.700 కోట్ల ఐపీఓకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇందు కోసం ఇప్పటికే సెబీకి దరఖాస్తు చేసింది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.210 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా రూ.490 కోట్లు సమీకరించనున్నట్టు తెలిపింది. కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కం పెనీ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్టు తెలిపింది.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2025 | 04:12 AM