డీప్ లాస్! స్టాక్ మార్కెట్ భారీ పతనం
ABN, Publish Date - Jan 28 , 2025 | 04:06 AM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాన్ని చవిచూశాయి. ఐటీ, టెలికాం, యుటిలిటీస్, పవర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్ రంగ షేర్లలో అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ ఒక దశలో 923 పాయింట్లు...
రూ.9.28 లక్షల కోట్ల సంపద క్షీణత
సెన్సెక్స్ 824 పాయింట్లు డౌన్
7 నెలలకు పైగా కనిష్ఠానికి సూచీ
23,000 దిగువకి నిఫ్టీ
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాన్ని చవిచూశాయి. ఐటీ, టెలికాం, యుటిలిటీస్, పవర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్ రంగ షేర్లలో అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ ఒక దశలో 923 పాయింట్లు క్షీణించింది. చివరికి సూచీ 824.29 పాయింట్ల (1.08 శాతం) నష్టంతో 7 నెలలకు పైగా కనిష్ఠ స్థాయి 75,366.17 వద్ద ముగిసింది. నిఫ్టీ 263.05 పాయింట్లు (1.14 శాతం) కోల్పోయి 22,829.15 వద్దకు జారుకుంది. సూచీ 23,000 దిగువకి పడిపోవడం గత ఏడాది జూన్ 6 తర్వాత ఇదే తొలిసారి. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్ సూచీ 3.51 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.68 శాతం పతనమయ్యాయి.
ఈ నెలలో రూ.32 లక్షల కోట్లు గల్లంతు
అమ్మకాల సునామీలో రూ.9.28 లక్షల కోట్ల మార్కెట్ సంపద గల్లంతైంది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.410.31 లక్షల కోట్లకు (4.75 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. గత వారాంతం సెషన్‌లోనూ రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అంటే, రెండో రోజుల్లోనే దాదాపు రూ.15 లక్షల కోట్ల సంపద తరిగిపోయింది. కాగా ఈ జనవరిలో ఇప్పవరకు బీఎ్‌సఈ మార్కెట్ క్యాప్ రూ.32 లక్షల కోట్ల మేర తగ్గింది. మార్కెట్ పతనానికి కారణాలు..
అమెరికా మార్కెట్లకు చైనా డీప్‌సీక్ షాక్
ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ, గూగుల్‌కు చెందిన జెమినీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌కు పోటీగా చైనా ఏఐ రీసెర్చ్ ల్యాబ్ డీప్‌సీక్ తాజాగా ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ ‘డీప్‌సీక్-ఆర్1’ను విడుదల చేసింది. డీప్‌సీక్ కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అమెరికన్ టెక్ కంపెనీల ఆధిపత్యానికి తెరదించవచ్చన్న ఆందోళనలతో ఎన్‌విడియాతో పాటు మిగతా టెక్ కంపెనీల షేర్లు ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో కుప్పకూలాయి. యూఎస్ మార్కెట్ సూచీల్లో డోజోన్స్ ఒకదశలో 400 పాయింట్లకు పైగా పడిపోగా.. నాస్‌డాక్ ఫ్యూచర్స్ 4 శాతానికి పైగా క్షీణించింది. అంతర్జాతీయంగా అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లపై ఇది ప్రతికూల ప్రభావం చూపింది.
ట్రంప్ వాణిజ్య విధానాలతో అనిశ్చితి
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలతో పాటు వాణిజ్య విధానాలతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఫెడ్ రిజర్వ్ సమీక్ష నేపథ్యంలో అప్రమత్తత
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తొలిసారిగా వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ఈ నెల 29న ప్రకటించనుంది. ఇప్పటికే ప్రామాణిక వడ్డీ రేట్లను 1 శాతం తగ్గించిన ఫెడ్.. ఈసారి యథాతథ స్థితినే కొనసాగించవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి సమీక్షలో తగ్గించే అవకాశాలకూ ట్రంప్ వాణిజ్య విధానాలు అడ్డంకిగా మారవచ్చన్న ఆందోళనల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తమై అమ్మకాలు పెంచారు. మరో వైపు భారత మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల తరలింపు కొనసాగుతూనే ఉంది. ఇది దేశీ య మార్కెట్ సెంటిమెంట్‌ను మరింతగా కుంగదీసింది.
ఇవి కూడా చదవండి:
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Stock Markets: స్టాక్ మార్కెట్లలో మళ్లీ క్షీణత.. మదుపర్లకు భారీ నష్టాలు
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 28 , 2025 | 04:06 AM