ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో కంట్రోల్‌ఎస్‌ 600 మెగావాట్ల డేటాసెంటర్‌ పార్క్‌

ABN, Publish Date - Jan 21 , 2025 | 06:50 AM

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌.. హైదరాబాద్‌లో కొత్త డేటా సెంటర్‌ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ సమీపంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న చందన్‌వల్లి ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 40 ఎకరాల విస్తీర్ణంలో...

చందన్‌వెల్లి పార్క్‌లో 40 ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌.. హైదరాబాద్‌లో కొత్త డేటా సెంటర్‌ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ సమీపంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న చందన్‌వల్లి ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 40 ఎకరాల విస్తీర్ణంలో 600 మెగావాట్ల ఐటీ లోడ్‌ సామర్థ్యంతో ఈ పార్క్‌ను నెలకొల్పాలని చూస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ పార్క్‌ అభివృద్ధి కోసం ఎంత మేర కు పెట్టుబడులు పెడుతుందనే వివరాలను మాత్రం కంట్రోల్‌ఎస్‌ వెల్లడించలేదు. ఈ పార్క్‌ తొలి దశ కోసం ఇప్పటికే 250 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అనుమతులు లభించినట్లు పేర్కొంది. కాగా భవిష్యత్తులో ఈ డేటాసెంటర్‌ పార్క్‌కు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు 900 మెగావాట్ల వరకు డెడికేటెడ్‌ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎ్‌స) ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు కంట్రోల్‌ఎస్‌ తెలిపింది.


హై డెన్సిటీ, అలా్ట్ర-హై డెన్సిటీ, ఏఐరెడీ, డేటాసెంటర్‌ భవనాల అనుసంధానం వంటి ఫీచర్లను కంట్రోల్‌ఎస్‌ చందన్‌వెల్లి డేటాసెంటర్‌ పార్క్‌ కలిగి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కంట్రోల్‌ఎస్‌.. హైటెక్‌సిటీలో ఒకటి, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో రెండు డేటా సెంటర్లను నిర్వహిస్తోంది.

Updated Date - Jan 21 , 2025 | 06:50 AM