ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కెనరా బ్యాంక్‌ లాభం రూ.4,104 కోట్లు

ABN, Publish Date - Jan 28 , 2025 | 03:57 AM

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికాని (క్యూ3)కి గాను బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన....

కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. డిసెంబరుతో ముగిసిన తృతీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికాని (క్యూ3)కి గాను బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 12.25 శాతం వృద్ధితో రూ.4,104 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.3,656 కోట్లుగా ఉంది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం కూడా రూ.32,334 కోట్ల నుంచి రూ.36,114 కోట్లకు పెరిగింది. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం పెరగటం సహా మొండి బకాయిలు తక్కువ స్థాయిలో ఉండటం కలిసి వచ్చిందని బ్యాంక్‌ పేర్కొంది. క్యూ3లో బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 4.39 శాతం నుంచి 3.34 శాతానికి. నికర ఎన్‌పీఏలు 1.32 శాతం నుంచి 0.89 శాతానికి తగ్గినట్లు కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు తెలిపారు.


దీంతో స్థూల ఎన్‌పీఏలను 3.5 శాతానికి చేర్చాలన్న లక్ష్యాన్ని తాము చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రొవిజన్‌ కవరేజీ నిష్పత్తి కూడా 91.26 శాతంగా ఉందని తెలిపారు. డిసెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 2.85 శాతం తగ్గుదలతో రూ.9,149 కోట్లుగా నమోదైంది.

గ్లోబల్‌ వ్యాపారం రూ.24 లక్షల కోట్లకు: డిసెంబరు ముగిసే నాటికి బ్యాంక్‌ గ్లోబల్‌ వ్యాపారం 9.3 శాతం వృద్ధితో రూ.24.19 లక్షల కోట్లకు చేరుకుంది. గ్లోబల్‌ డిపాజిట్లు 8.44 శాతం వృద్ధి చెంది రూ.13.69 లక్షల కోట్లకు చేరుకోగా అడ్వాన్సులు రూ.10.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు దేశీయ డిపాజిట్లు రూ.12.57 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో 16.44 శాతంగా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చిన రుణాలు 44.33 శాతం, వ్యవసాయ రుణాలు 21.04 శాతంగా ఉన్నట్లు కెనరా బ్యాంక్‌ పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..


Stock Markets: స్టాక్ మార్కెట్లలో మళ్లీ క్షీణత.. మదుపర్లకు భారీ నష్టాలు

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి


Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 28 , 2025 | 03:57 AM