ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MSME : ఎంఎస్‌ఎంఈలకు ఊతం

ABN, Publish Date - Feb 02 , 2025 | 05:45 AM

దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈసారి బడ్జెట్‌లో పలు చర్యలు ప్రకటించారు. ఎంఎ్‌సఎంఈల వర్గీకరణకు సంబంధించిన పెట్టుబడి పరిమితిని 2.5 రెట్లు, టర్నోవర్‌ లిమిట్‌ను 2 రెట్లు పెంచారు. రూ.2.5 కోట్ల వరకు పెట్టుబడి, రూ.10 కోట్ల వరకు

  • వాటి వర్గీకరణలో పెట్టుబడి, టర్నోవర్‌ పరిమితి భారీగా పెంపు

  • సూక్ష్మ పరిశ్రమలకు రూ.5 లక్షల పరిమితితో కూడిన క్రెడిట్‌ కార్డులు

  • సూక్ష్మ, చిన్న సంస్థలకు క్రెడిట్‌ గ్యారెంటీ పథకం పరిమితి రూ.10 కోట్లకు పెంపు

  • వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థలకు రూ.1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈసారి బడ్జెట్‌లో పలు చర్యలు ప్రకటించారు. ఎంఎ్‌సఎంఈల వర్గీకరణకు సంబంధించిన పెట్టుబడి పరిమితిని 2.5 రెట్లు, టర్నోవర్‌ లిమిట్‌ను 2 రెట్లు పెంచారు. రూ.2.5 కోట్ల వరకు పెట్టుబడి, రూ.10 కోట్ల వరకు వార్షిక టర్నోవర్‌ కలిగిన వాటిని సూక్ష్మ పరిశ్రమగా పరిగణిస్తారు. రూ.25 కోట్ల వరకు పెట్టుబడి, రూ.100 కోట్ల వరకు టర్నోవర్‌ కలిగినవి చిన్న స్థాయి పరిశ్రమల పరిధిలోకి వస్తాయి. రూ.125 కోట్ల వరకు పెట్టుబడి, రూ.500 కోట్ల వరకు టర్నోవర్‌ కలిగిన వాటిని మధ్య స్థాయి పరిశ్రమగా పరిగణిస్తారు. ఎంఎ్‌సఎంఈలు సామర్థ్యాన్ని విస్తరించడంతోపాటు సాంకేతిక ఆధునీకరణకు, మరింత మూలధన లభ్యత మెరుగుపడేందుకు ఇది దోహదపడనుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వాటి వ్యాపార వృద్ధిపై నమ్మకం పెంచడంతో పాటు యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించేందుకు ఇది దోహదపడనుందన్నారు. ప్రస్తుతం దేశంలో కోటికి పైగా రిజిస్టర్డ్‌ ఎంఎ్‌సఎంఈలు ఉన్నాయి. వీటిల్లో 7.5 కోట్ల మంది పనిచేస్తున్నారు. దేశ తయారీలో 36 శాతం, ఎగుమతుల్లో 45 శాతం వాటా వీటిదేనని ఆమె పేర్కొన్నారు.


మరిన్ని చర్యలు

  1. సూక్ష్మ పరిశ్రమల తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు వీలుగా రూ.5 లక్షల క్రెడిట్‌ లిమిట్‌తో కూడిన క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యమ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న మైక్రో కంపెనీలకు ఈ కార్డులు అందుబాటులో ఉంటాయని, తొలి ఏడాదిలో 10 లక్షల కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

  2. సూక్ష్మ, చిన్న స్థాయి పరిశ్రమలకు క్రెడిట్‌ గ్యారెంటీ పథక పరిమితిని ప్రభుత్వం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచింది. తద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు ఈ పరిశ్రమలకు అందుబాటులో వస్తాయని తెలిపారు. అంతేకాదు, వాటికి ఆర్థిక సమస్యల్లేకుండా మంచి పనితీరు కనబరుస్తున్న ఎగుమతి ఎంఎ్‌సఎంఈలకు రూ.20 కోట్ల వరకు టర్మ్‌ లోన్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

  3. 5 లక్షల మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా వచ్చే ఐదేళ్ల పాటు రూ.2 కోట్ల వరకు టర్మ్‌ లోన్స్‌ అందించనున్నారు.

  4. స్టార్ట్‌పలకు కూడా క్రెడిట్‌ గ్యారంటీ పథకం కింద కవరేజీని రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌కు కీలకమైన 27 రంగాలకు రుణా లపై గ్యారెంటీ ఫీజును ఒక శాతానికి తగ్గించారు.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 05:45 AM