బడా షేరు కళకళ.. చిన్న స్టాక్స్ విలవిల
ABN, Publish Date - Jan 23 , 2025 | 06:24 AM
స్టాక్ మార్కెట్లో బుధవా రం మిశ్రమ ట్రెండ్ కన్పించింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మదుపరులు బ్లూచిప్ ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లకు పాల్పడటంతో సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ లాభాల...
మార్కెట్‌లో మిశ్రమ స్పందన.. 567 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ఒక శాతానికి పైగా నష్టపోయిన స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు
రూ.2.18 లక్షల కోట్లు తగ్గిన సంపద
ముంబై: స్టాక్ మార్కెట్లో బుధవా రం మిశ్రమ ట్రెండ్ కన్పించింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మదుపరులు బ్లూచిప్ ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లకు పాల్పడటంతో సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ ఒకదశలో 624.77 పాయింట్లు పెరిగి 76,463.13 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 566.63 పాయింట్ల లాభంతో 76,404.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 130.70 పాయింట్ల వృద్ధితో 23,155.35 వద్ద ముగిసింది. ప్రధాన కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగినప్పటికీ చిన్న, మధ్య స్థాయి షేర్లలో మాత్రం అమ్మకాలు కొనసాగాయి.
దాంతో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.56 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం క్షీణించాయి. డిసెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో హైదరాబాద్ కంపె నీ సైయెంట్ డీఎల్‌ఎం షేరు 14 శాతం మేర క్షీణించి రూ.515.70కి పడిపోయింది. స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లలో అమ్మకాల కారణంగా బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.18 లక్షల కోట్లు తగ్గి రూ.421.88 లక్షల కోట్లకు పడిపోయింది.
ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు పెరిగి రూ.86.35 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ కాస్త బలహీనపడటంతోపాటు ప్రధాన ఈక్విటీల్లో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి.
Also Read:
రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్
సైఫ్ కేసు.. వాళ్లే చంపాలనుకున్నారా
కొంప ముంచిన పిల్లి.. ఉద్యోగం లేదు, బోనస్ లేదు..
For More Business News and Telugu News..
Updated Date - Jan 23 , 2025 | 06:26 AM