ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బంగారం..బంగారమే

ABN, Publish Date - Mar 04 , 2025 | 02:34 AM

సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఢోకా లేదని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ అన్నారు. ఈ కోణంలో చూస్తే...

సురక్షిత పెట్టుబడి సాధనం

భవిష్యత్‌లోనూ డిమాండ్‌

సీఈఏ అనంత నాగేశ్వరన్‌

న్యూఢిల్లీ: సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఢోకా లేదని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ అన్నారు. ఈ కోణంలో చూస్తే భవిష్యత్‌లో పసిడికి డిమాండ్‌ మరింత పెరుగుతుందన్నారు. పసిడి, పసిడి మార్కెట్లపై ఐజీపీసీ-ఐఐఎంఏ నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్టుబడుల వివిధీకరణ (డైవర్సిఫికేషన్‌) కోసం చూసే ప్రతి మదుపరి పోర్టుఫోలియోలో బంగారం తప్పనిసరిగా ఉండాలన్నారు. ‘స్టోర్‌ వాల్యూ, సాంస్కృతిక, మతపరమైన ఉత్సవాల్లో నగగానేగాక, పసిడి ప్రతి వ్యక్తి పెట్టుబడుల పోర్టుఫోలియోలో ఉండాల్సిన ఆస్తి’ అని ఆయన అన్నారు.


పదింతలు పెరిగిన విలువ

గత 23 సంవత్సరాలకు చూసినా ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 250/290 డాలర్ల నుంచి పదింతలు పెరిగిందని నాగేశ్వరన్‌ అన్నారు. గత మూడు నెలల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ 8 శాతం నష్టపోతే, ఔన్స్‌ మేలిమి (24 క్యారట్స్‌) బంగారం విలువ మాత్రం 200 డాలర్లు (8 శాతం) పెరిగి 2,860 డాలర్లకు చేరిన విషయాన్ని గుర్తు చేశారు. పసిడి ప్రాముఖ్యత ముందు ముందు మరింత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం మన దేశంలో బంగారాన్ని నగల తయారీ లేదా సురక్షిత పెట్టుబడిగానే ఉపయోగిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ ధోరణి మారి, మరింత ప్రయోజనకరంగా ఉపయోగించే అవకాశం ఉందని నాగేశ్వరన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.


అప్పులపై జర జాగ్రత్త

ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ప్రభుత్వాల అప్పులపైనా సీఈఏ నాగేశ్వరన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అప్పులు అనేక దేశాలకు మోయలేని భారంగా మారాయన్నారు. దీంతో భవిష్యత్‌లో ప్రభుత్వాల ఆదాయాలు ఈ అప్పుల చెల్లింపులకే సరిపోతాయి తప్ప, అభివృద్ధి ఖర్చులకు ఏమీ మిగలవన్నారు. ఈ ఏడాది మార్చి ముగిసేనాటికి మన దేశ అప్పు జీడీపీలో 57.1 శాతానికి చేరే అవకాశం ఉందన్నారు. 2026 మార్చి నాటికి దీన్ని 56.1 శాతానికి తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2025 | 02:34 AM