డీబీఎస్ గ్రూప్‌లో 4,000 మందికి ఉద్వాసన
ABN, Publish Date - Feb 25 , 2025 | 02:10 AM
ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజం డీబీఎస్ గ్రూప్ భారీగా ఉద్యోగులకు ఉద్వాసన చెబుతోంది. వర్థమాన టెక్నాలజీ కృత్రిమ మేధ (ఏఐ) అమలు ఇందుకు కారణం. రాబోయే మూడేళ్ల కాలంలో తాము 10 శాతం అంటే...
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజం డీబీఎస్ గ్రూప్ భారీగా ఉద్యోగులకు ఉద్వాసన చెబుతోంది. వర్థమాన టెక్నాలజీ కృత్రిమ మేధ (ఏఐ) అమలు ఇందుకు కారణం. రాబోయే మూడేళ్ల కాలంలో తాము 10 శాతం అంటే 4,000 ఉద్యోగాలకు కోత పెట్టాల్సివస్తుందని బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీయూష్ గుప్తా తెలిపారు. బ్యాంకుకు సారథ్యం వహిస్తున్న 15 సంవత్సరాల కాలంలో తొలిసారి గా కొత్త ఉద్యోగాల సృష్టికి తాను చాలా శ్రమించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. తమ బ్యాంకులో గత 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉద్యోగాల కోత లేదని ఆయన తెలిపారు. 2016-17 సంవత్సరంలో బ్యాంకు భారీగా డిజిటైజేషన్ చేపట్టినప్పుడు 1,600 ఉద్యోగాలకు కోత విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కాని యూనియన్లు, వారి ప్రతినిధులతో మాట్లాడి వారందరినీ ఇతర శాఖల్లో సద్దుబాటు చేశామని ఆయన అన్నారు. రెండేళ్ల క్రితం డీబీఎస్ జెనరేటివ్ ఏఐ సొల్యూషన్ల అమలును ప్రారంభించిందని, వాటి ఫలితం ఎలా ఉందన్నది ఇంకా వెల్లడి కావలసి ఉన్నదని గుప్తా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్
OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 25 , 2025 | 02:10 AM