ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కీలక ఖనిజాల మిషన్‌కు రూ.34,300 కోట్లు

ABN, Publish Date - Jan 30 , 2025 | 02:31 AM

జాతీయ ప్రాధాన్యత ఉన్న అరుదైన రాగి, లిథియం, నికెల్‌, కోబాల్ట్‌ వంటి 24 కీలక ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జాతీయ కీలక ఖనిజాల మిషన్‌ (ఎన్‌సీఎం) పేరుతో...

కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర..పీఎ్‌సయూల నుంచి రూ.18,000 కోట్లు

న్యూఢిల్లీ: జాతీయ ప్రాధాన్యత ఉన్న అరుదైన రాగి, లిథియం, నికెల్‌, కోబాల్ట్‌ వంటి 24 కీలక ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జాతీయ కీలక ఖనిజాల మిషన్‌ (ఎన్‌సీఎం) పేరుతో ప్రత్యేక జాతీయ మిషన్‌ ఏర్పాటు చేసిం ది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ కీలక ఖనిజాల దిగుమతులను తగ్గించి, స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ మిషన్‌ ద్వారా వచ్చే ఏడేళ్లలో రూ.34,300 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేంద్ర సమాచార, ప్రసారా ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. ఇందు లో రూ.18,000 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థలు, రూ.16,300 కోట్లు ప్రైవేటు సంస్థలు పెట్టుబడు లు పెడతాయన్నారు.


ఎందుకంటే ?

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న వాహనాల్లో దాదాపు 90 శాతం పెట్రోల్‌, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాలతో నడుస్తూ, పెద్ద ఎత్తున పర్యావరణా న్ని కలుషితం చేస్తున్నాయి. విద్యుత్‌ వాహనాల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే ఈ వాహనాలకు అవసరమైన బ్యాటరీలతో పాటు పవన విద్యుత్‌ కేంద్రాల టర్బైన్లు, విద్యుత్‌ పరికరాలు, సరఫరాల్లోనూ ఈ ఖనిజాలది కీలక పాత్ర. ప్రస్తుతం మన దేశంలో ఈ ఖనిజ నిక్షేపాలు, నిల్వలు చాలా తక్కువ. ఈ సమస్యను అధిగమించేందుకు దేశ, విదేశాల్లో ఈ ఖనిజాల అన్వేషణ, ప్రాసెసింగ్‌, ఉత్పత్తి, రీసైక్లింగ్‌ వరకు అన్ని స్థాయిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభు త్వం ఈ మిషన్‌ ప్రారంభించింది. విదేశాల్లో ఈ తరహా ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తికి ముందుకు వచ్చే దేశీయ కంపెనీలకు కూడా ప్రభుత్వం సహాయ పడుతుందని వైష్ణవ్‌ చెప్పారు.


ఇవి కూడా చదవండి:

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 02:31 AM