యూబీఐ లాభంలో 28% వృద్ధి
ABN, Publish Date - Jan 28 , 2025 | 03:46 AM
ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.4,604 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.4,604 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.3,590 కోట్లు)తో పోల్చితే లాభం 28 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.29,137 కోట్ల నుంచి రూ.31,375 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం కూడా రూ.25,163 కోట్ల నుంచి రూ.26,958 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ పేర్కొంది. మరోవైపు బ్యాంక్ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 4.8 శాతం నుంచి 3.8 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.08 శాతం నుంచి 0.8 శాతానికి దిగొచ్చాయి. ఈ కాలంలో బ్యాంక్ ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి 93.42 శాతంగా ఉండగా క్యాపిటల్ అడిక్వసీ రేషియో 15.03 శాతం నుంచి 16.7 శాతానికి పెరిగింది
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jan 28 , 2025 | 04:56 AM