ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.2,758 లక్షల కోట్ల డిజిటల్‌ లావాదేవీలు

ABN, Publish Date - Jan 28 , 2025 | 03:44 AM

దేశంలో డిజిటల్‌ లావాదేవీలు శరవేగంతో పెరుగుతున్నాయి. 2013లో రూ.772 లక్షల కోట్ల విలువైన 222 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు మన దేశంలో నమోదయ్యాయి. 2024 నాటికి డిజిటల్‌...

ముంబై: దేశంలో డిజిటల్‌ లావాదేవీలు శరవేగంతో పెరుగుతున్నాయి. 2013లో రూ.772 లక్షల కోట్ల విలువైన 222 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు మన దేశంలో నమోదయ్యాయి. 2024 నాటికి డిజిటల్‌ లావాదేవీల విలువ రూ.2,758 లక్షల కోట్లకు, లావాదేవీలు 94 రెట్లు పెరిగి 20,787 కోట్లకు చేరాయి. సోమవారం విడుదలైన భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నివేదిక ఈ విషయం తెలిపింది. గత ఐదేళ్లలో దేశంలో క్రెడిట్‌ కార్డుల సంఖ్యా 5.53 కోట్ల నుంచి రెట్టింపై 10.80 కోట్లకు చేరగా, డెబిట్‌ కార్డులు మాత్రం పెద్ద మార్పేమీ లేకుండా 80.53 కోట్ల నుంచి 99.09 కోట్లకు చేరాయి.

డిజిటల్‌ మోసాలపై జర జాగ్రత్త: దేశ బ్యాంకింగ్‌ రంగంలో పెరిగిపోతున్న డిజిటల్‌ మోసాలపై ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్‌ మోసాలను అడ్డుకునేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల ఎండీ, సీఈఓలను ఆయన కోరారు. అలాగే తమకు సేవలందించే థర్డ్‌ పార్టీ సేవలపైనా బ్యాంకులు ఒక కన్నేయాలని కోరారు.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 28 , 2025 | 03:44 AM