Welfare Loans : ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఒక్కొక్కరికి 2 కోట్ల రుణం!
ABN, Publish Date - Feb 02 , 2025 | 04:31 AM
మహిళా సాధికారత, సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌లో కేంద్రం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని తెచ్చింది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే ఆయా వర్గాల మహిళలకు వచ్చే ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.2 కోట్ల వరకు రుణాలను అందించనున్నారు.
మహిళా సాధికారత, సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌లో కేంద్రం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని తెచ్చింది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే ఆయా వర్గాల మహిళలకు వచ్చే ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.2 కోట్ల వరకు రుణాలను అందించనున్నారు. దీంతో 5 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కొత్త ఉద్యోగాలు, ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ముద్ర యోజన, స్టాండప్ ఇండియా పథకం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ), ఉద్యమ్ శక్తి పోర్టల్ వంటి పథకాలు తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది.
Updated Date - Feb 02 , 2025 | 04:31 AM