ప్రజాసమస్యలు పరిష్కరించండి
ABN, Publish Date - Feb 05 , 2025 | 12:15 AM
ప్రజాస మస్యలపై ఎప్పటికపుడు స్పందించి వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే సింధూరా రెడ్డి అఽధికారులకు సూచించారు.
ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): ప్రజాస మస్యలపై ఎప్పటికపుడు స్పందించి వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే సింధూరా రెడ్డి అఽధికారులకు సూచించారు. మంగళ వారం అమడగూరులోని ఎంపీడీఓ కార్యాల యంలో సాధారణ సర్వసభ్యసమావేశాన్ని ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహిం చారు. ఇందులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని.. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత, రోడ్లు, మురుగునీటి పనులపై ప్రజాప్రతినిధులు దృష్టి సారిం చాలన్నారు. ఉపాధి పథకంలో పనులు చేయనివారికి కూడా బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై దృష్టిసా రించి, నిజంగా పనులు చేసే కూలీలకు డబ్బులు అందేలా చూడాలని ఏపీఓ అమరావతికి ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Feb 05 , 2025 | 12:15 AM