ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: అంకెలు ఘనం.. కేటాయింపులు శూన్యం: షర్మిల

ABN, Publish Date - Mar 01 , 2025 | 06:29 AM

శుక్రవారం ఆమె ఎక్స్‌ వేదికగా బడ్జెట్‌పై స్పందించారు. ‘అంతా అంకెల గారడి, అభూత కల్పన. దశ-దిశ, పస లేని బడ్జెట్‌ ఇది. రాష్ట్రం గుల్ల... బడ్జెట్‌ అంతా డొల్ల. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది.

అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో సంఖ్య ఘనం... కేటాయింపులు శూన్యం’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆమె ఎక్స్‌ వేదికగా బడ్జెట్‌పై స్పందించారు. ‘అంతా అంకెల గారడి, అభూత కల్పన. దశ-దిశ, పస లేని బడ్జెట్‌ ఇది. రాష్ట్రం గుల్ల... బడ్జెట్‌ అంతా డొల్ల. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది. ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు పంగనామాలు పెట్టారు. ఇతర హామీలకు ఎగనామం పెట్టారు. ఇది మంచి ప్రభుత్వం కాదు... ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్‌తోనే నిరూపితం అయింది. ప్రభుత్వ ఉద్యోగులను వంచించారు. రాష్ట్ర రాజధానికి ఒక్క రూపాయి కేటాయించకుండా అప్పులతోనే అమరావతి కట్టాలని చూడటం మీ అవివేకానికి నిదర్శనం. రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ఎన్నికల హామీలను గాలికి వదిలేసి, మసి పూసి మారేడు కాయ చేశారు. ఈ బడ్జెట్‌లో విజన్‌ లేదు... విజ్డమూ లేదు. కేవలం ఇంద్రజాలమే. మిషన్‌ లేదు, మీనింగూ లేదు. కేవలం మహేంద్రజాలమే’ అంటూ షర్మిల మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదన్న షర్మిల... వివిధ పథకాలకు చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయని, కొన్నింటికి అసలు కేటాయింపులే లేవని అంటూ వివరణాత్మక విమర్శ చేశారు.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్

Vamsi Petition: బ్యారక్ మార్చండి.. లేదా ఖైదీలను పంపండి.. వంశీ పిటిషన్

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2025 | 06:29 AM