తమ్మిలేరులో మునిగి అన్నదమ్ములు మృతి
ABN, Publish Date - Feb 27 , 2025 | 12:36 AM
బలివే మహా శివరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది.
మృతదేహాల వెలికితీత
శివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి
తిమ్మక్కపాలెంలో విషాదం
పెదవేగి/ముసునూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): బలివే మహా శివరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. తమ్మిలేరులో పుణ్య స్నానాల అనంతరం ఈత సరదా అన్నదమ్ముల కు మృత్యుపాశమైంది. లింగపాలెం మండలం తిమ్మక్కపాలేనికి చెందిన పేరిచర్ల మారేష్, మం గమ్మ, వారి ఇద్దరు కుమారులు మునియ్య, మణి కుమార్, బంధువులతో కలిసి బుధవారం బలివే ఆలయం వద్ద తమ్మిలేరులో స్నానాలు చేసి దర్శనానికి బయలుదేరారు. మారేష్ కుమా రులిద్దరూ కొద్దిసేపు స్నానంచేసి వస్తామన్నారు. దర్శనానికి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు కుమారు లిద్దరూ రాకపోవడంతో జనంలో ఉన్నారేమోనని వెతు కుతు తమ్మిలేరు దగ్గరకు చేరుకున్నారు. ఇంతలో తమ్మిలేరు స్నానఘట్టాలకు ఎగువన మునిపల్లె సమీపంలో తమ్మిలేరు నీటిమడుగులో మృతదేహం ఉందనే సమాచారం తెలిసింది. అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులకు చిన్న కుమా రుడు మణి కుమార్ (18) మృతదేహం కనిపిం చడంతో హతాశులయ్యారు. మరో కుమారుడు ఎక్కడో చోట ఉన్నాడనే ఆశతో వెతుకుతుండగా నీటి మడుగులో గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందా లకు పెద్ద కుమారుడు మునియ్య (20) మృతదే హం కూడా లభించింది. అప్పటివరకు కళ్లెదుటే ఆడుతూ, పాడుతూ ఉన్న ఇద్దరు కుమారులు విగతజీవులుగా కనిపించడంతో తల్లి మంగమ్మ, తండ్రి మారేష్, బంధువుల రోదనలతో విషాదం అలుముకుంది. దీనిపై కేసునమోదు చేసి, దర్యా ప్తు చేస్తున్నామని ముసునూరు ఎస్‌ఐ తెలిపారు. ఒకపక్క పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకో కుండా తమ్మిలేరులో దిగడంతో వారు దుర్మర ణం పాలయ్యారని అక్కడివారు చెబుతున్నారు. స్నాన ఘట్టాల సమీపంలో తమ్మిలేరు లోపకలికి వెళ్లనీయడంలేదని వారిద్దరు అక్కడకు కొద్ది దూరంలో ఎగువ భాగంలో నీటిలో దిగి, మృత్యుఒడికి చేరడం విషాదం.
గుండెపోటుతో ఇద్దరు..
పోలవరం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ మహా శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం ఇసుక తిన్నెల్లో అన్నదానం నిర్వహించడానికి వచ్చిన ఆర్యవైశ్య సంఘం నాయకుడు మండవల్ల నాగ వీరభద్ర రావు(67) గుండెపోటుతో మృతి చెందారు. అన్నదాన సత్రం సమీపం నుంచి లఘుశంఖ తీర్చుకోవడానికి ఇసుక తిన్నెల్లో కొంతమేర నడిచి వచ్చిన ఆయన గుండెనొప్పితో కుప్ప కూలిపోయారు. వైద్య సిబ్బంది సీపీఆర్ చేసిన ప్పటికీ ఫలితం లేకపోయింది. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
బలివే ఆలయం వద్ద..
ముసునూరు: బలివే రామేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఏలూరు టౌన్‌కు చెందిన బోర అన్నవరం (45) స్వామివారి దర్శనం అనంతరం ఒక్కసారిగా కూప్పకూలిపోయాడు. డాక్టర్ షకీనా ఇవాంజలి సీపీఆర్ చేసి, 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పం పించారు. అప్పటికే అన్నవరం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Updated Date - Feb 27 , 2025 | 12:36 AM