మహిళలపై దాడులు అరికట్టేందుకు చర్యలు
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:36 AM
మహిళలపై దాడు లు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, మహిళా రక్షణ బృందాల ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజి జీవీజీ. అశోక్‌కుమార్ తెలిపారు.
పెనుమంట్ర, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) మహిళలపై దాడు లు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, మహిళా రక్షణ బృందాల ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజి జీవీజీ. అశోక్‌కుమార్ తెలిపారు. పెనుమంట్ర పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలిం చారు. విలేకరులతో మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈవ్ టీజింగ్ అరికట్టేందుకు కళాశాల, హైస్కూల్ స్థాయిలో ఈగల్ క్లబ్బులను ఏర్పాటు చేశామ న్నారు. గంజాయి, డ్రగ్స్‌పై నిఘా వ్యవస్థలు డేగ కన్ను వేశాయన్నారు. మార్టేరులో అవుట్ పోస్టు పునరుద్ధరి స్తామన్నారు. ఎస్పీ నయీమ్‌ఆస్మి, డీఎస్పి శ్రీవేద, పెనుగొండ సీఐ రాయుడు విజయ్‌కుమార్, పెనుమంట్ర ఎస్‌ఐ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2025 | 01:36 AM