బలివే ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి
ABN, Publish Date - Feb 19 , 2025 | 01:33 AM
బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలను అన్నిశాఖల అధికారులు సమన్వ యంతో పని చేయాలని జిల్లా కలె క్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు.
ముసునూరు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలను అన్నిశాఖల అధికారులు సమన్వ యంతో పని చేయాలని జిల్లా కలె క్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. మంగళ వారం ఉత్సవాల ఏర్పాట్లును ఆమె పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ.100, రూ. 25తోపాటు ఉచిత దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. స్నానఘ ట్టాల వద్ద జల్లుల స్నానాలు ఏర్పాటు, పిండ ప్రదానాలకు ప్రత్యేక ప్రదేశంలో ఏర్పాటు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేకం గా గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఘాట్ల వద్ద గజ ఈతగాళ్ల పర్యవేక్షణ ఉండాలని అన్నారు. పిండ ప్రదానాలు చేసే పురోహితులకు గుర్తింపు కార్డులు జారీ చేయా లని సూచించారు. సమావేశంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు, ఈవో పామర్తి సీతారామయ్య, తహసీల్దార్ కె.రాజ్‌కుమార్, ఎంపీడీవో జి.రాణి, సీఐ రామ కృష్ణ, ఎస్‌ఐ చిరంజీవి, డీఎల్‌సీవో సుందరి, వైద్యాధికారి షకీనా ఇవాంజలి పాల్గొన్నారు.
Updated Date - Feb 19 , 2025 | 01:33 AM