నరసాపురం–మచిలీపట్నం కొత్త రైల్వే లైన్‌కు డీపీఆర్ సిద్ధం
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:59 AM
నరసాపురం–మచిలీపట్నం మధ్య చేపట్టే కొత్త రైల్వేలైన్ పనులకు డీపీఆర్ సిద్ధమైందని, రానున్న బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల య్యే ఛాన్స్ ఉందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ సెంటర్లు
నరసాపురం– వారణాసి మధ్య కొత్త రైలుకు ప్రతిపాదన
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ
నరసాపురం, జనవరి 2(ఆంధ్ర జ్యోతి):నరసాపురం–మచిలీపట్నం మధ్య చేపట్టే కొత్త రైల్వేలైన్ పనులకు డీపీఆర్ సిద్ధమైందని, రానున్న బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల య్యే ఛాన్స్ ఉందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. గురు వారం నరసాపురంలో ఆయన విలేక ర్లతో మాట్లాడారు. నరసాపురం– కోటి పల్లి రైల్వేలైన్ జాప్యానికి నిధులు, భూసేకరణనే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ళల్లో ఇవ్వాల్సిన వాటా మొత్తంలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ఈ బడ్జెట్‌లో విడు దలయ్యే నిధులతో ఈ పనులు వేగవం తం అవుతాయన్నారు. నరసాపురం వారణాశిల మధ్య కొత్త రైలు, నరసా పురం–సికింద్రాబాద్‌ల మధ్య వందేభారత్ రైలు ప్రతిపాదనలో ఉంద న్నారు. త్వరలో భీమవరం–చెన్నైల మధ్య వందేభారత్‌ను కూడా తీసుకొస్తామన్నారు. కూటమి రాకతో రాష్ట్రంలో పరిస్థితి మారిందని, పరిశ్రమల ఏర్పాటుకు ఆనువైన వాతావరణం నెలకొందన్నారు.
165ఎన్‌హెచ్‌కు ఐదు ఎలైన్‌మెంట్లు
పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి ఆకి వీడు వరకు నిర్మించే 165 జాతీయ రహదారికి ఐదు ఎలైన్‌మెంట్లను ఎన్‌హెచ్ అధికారులు ప్రతిపాధించారన్నారు. వీటితో పాటు రైల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మించే ఆర్వోవి వంతెన నిర్మా ణాల ఖర్చు, తదితర ప్రతిపాదనలు పూర్తికా గానే ఈ పనులకు నిధులు విడుదల అవుతా యన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో డయాలసీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి రూ.10కోట్లు కేం ద్రం నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ప్రైవే ట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతల్ని అప్పగిస్తా మన్నారు. తణుకు, టీపీగూడెం కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లను అప్‌గ్రేడ్ చేస్తామన్నా రు. జిల్లాలోని అన్ని బరియల్ గ్రౌండ్‌లకు ఫెన్సింగ్ వాల్‌కు అవసరమైన నిధుల్ని మం జూరు చేస్తామన్నారు. అంతకు ముందు శ్రీని వాసవర్మను కొవ్వలి నాయుడు, పొత్తూరి ఘనంగా సత్కరించారు. నారిన తాతాజీ, మేకల సతీశ్, పీవీఆర్, బొమ్మిడి సునీల్, సంకు భాస్క ర్, మల్లాడి మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 03 , 2025 | 12:59 AM