వైభవంగా జైన్ మందిర్ ప్రతిష్ఠ
ABN, Publish Date - Mar 10 , 2025 | 12:47 AM
ఆచంటలో నూతనంగా నిర్మించిన రాజేంద్ర సూరీజీ గురుధ్యాన జైన్ మందిర్ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది.
ఆచంట, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఆచంటలో నూతనంగా నిర్మించిన రాజేంద్ర సూరీజీ గురుధ్యాన జైన్ మందిర్ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జైన్ గురువు లు ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజులుగా వివిధ రాష్ట్రాల భక్తులతో జైన్ మందిరం కిక్కిరిసిపోయింది. జైన్ గురువులు పూజలు, హోమాలు శిఖర ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్త పల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. జైన్ ట్రస్టు కమిటీ చైర్మన్ అజిత్ కుమార్ జైన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.
Updated Date - Mar 10 , 2025 | 12:47 AM