ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సౌత్‌ జోన్‌ పోటీలకు జేఎన్‌టీయూకే హ్యాండ్‌ బాల్‌ జట్లు ఎంపిక

ABN, Publish Date - Feb 01 , 2025 | 12:49 AM

సౌత్‌ జోన్‌ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళ నాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ) హ్యాండ్‌ పోటీలకు జేఎన్‌టీయూకే బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు.

సౌత్‌ జోన్‌ హ్యాండ్‌ పోటీలకు ఎంపికైన జేఎన్‌టీయూకే బాలుర జట్టు

వేగవరంలో ముగిసిన ఎంపిక పోటీలు

దెందులూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): సౌత్‌ జోన్‌ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళ నాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ) హ్యాండ్‌ పోటీలకు జేఎన్‌టీయూకే బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. వేగవరంలోని హేలా పురి ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో రెండు రోజులుగా జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో జరగు తున్న ఎంపిక పోటీలు శుక్రవారం ముగిశాయి. ఆరు జిల్లాల అంతర కళాశాలల జట్లు పాల్గొన్న పోటీలు హోరాహోరీగా సాగాయి. బాలికల విభాగంలో ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీ, రామ చంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీ, జేఎన్‌టీ యూ, హేలాపూరి కాలేజీల నుంచి ప్రతిభ కనబరిచిన 16 క్రీడాకారులు బాలుర జట్టుకు ఎంపికయ్యారు. బాలి కల జట్టుకు 16 మంది ఎంపికైనట్లు కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎం.లావణ్య, ఏవో కరుణానిధి తెలిపారు. బాలికల జట్టు జేఎన్‌టీయూకే తరుపున ఫిబ్రవరి 19న తమిళనాడు రాష్ట్రం సేలంలోని పెరియా ర్‌ యూనివర్సిటీలో జరిగే సౌత్‌ జోన్‌ హ్యాండ్‌ బాల్‌ పోటీలో పాల్గొంటారు. బాలుర విభాగంలో ఫిబ్రవరి 22 నుంచి పెరియార్‌ యూనివర్సిటీ హ్యాండ్‌ బాల్‌ జట్టుగా పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ లావణ్య తెలిపారు. కాగా ఎంపిక పోటీలో బాలుర విభాగం విజేత లుగా ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీ, రన్నర్స్‌గా హేలాపురి కాలేజీ జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీ జట్టు విజేత కాగా సీఆర్‌ రెడ్డి కాలేజీ జట్టు రన్నర్స్‌గా నిలిచారు.

Updated Date - Feb 01 , 2025 | 12:49 AM