ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫీజులు చెల్లించారు

ABN, Publish Date - Feb 05 , 2025 | 01:21 AM

కళాశాలలకు కాస్త ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేసింది.

తొలి త్రైమాసిక ఫీజు విడుదల

కళాశాలల యాజమాన్యాలకు ఊరట

ఈబీసీ విద్యార్థులకు పెండింగ్‌.. త్వరలోనే మంజూరు చేసే అవకాశం

వైసీపీ పెట్టిన బకాయిలపైనా తర్జన భర్జన

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

కళాశాలలకు కాస్త ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేసింది. వైసీపీ హయాంలో బకాయిలను తాత్కాలికంగా పక్కన పెట్టింది. అవి ఎవరి ఖాతాలో జమ చేయాలన్న విషయమై ప్రభుత్వ స్థాయిలో మీమాంస నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కళాశాలల ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా 2024–25 విద్యా సంవత్సరంలో తొలి త్రైమాసిక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కళాశాలల ఖాతాలో జమ చేసింది. దీనివల్ల కళాశాలలకు కాస్త ఉపశమనం లభించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి సొమ్ములను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ–బీసీ విద్యార్థులు అంటే జనరల్‌ కేటగిరిలో ఆర్థికంగా వెనుకపడిన విద్యార్థులకు ఇంకా ఫీజు చెల్లించలేదు. రాష్ట్రవ్యాప్తంగా రూ.200 కోట్లను ఇదే కేటగిరీ కింద జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులను విడుదల చేశారు.

ఎస్‌సి విద్యార్థులకు సొంత ఖాతాలోనే

వైసీపీ హయాంలో చేసిన తప్పిదాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. కరోనా సమయంలో గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఫీజులను దారి మళ్లించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి సౌకర్యాలకు సంబంఽధించి 60 శాతం సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం తన వంతుగా 60 శాతం ఫీజును సకాలంలో విడుదల చేస్తోంది. కరోనా సమయంలో వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించడంతో సమస్య ఏర్పడింది. పైగా కేంద్రం నుంచి సొమ్ములు తీసుకుని విద్యార్థులకు చెల్లించలేదు. అందులోనూ ఒక క్వార్టర్‌ సొమ్మును పూర్తిగా ఎగనామం పెట్టింది. ఫలితంగా విద్యార్థులే ఆ సొమ్మును చెల్లించుకున్నారు. అప్పటి నుంచి కేంద్రం చెల్లించే ఫీజుకు సంబంధించి వినియోగ ధ్రువీకరణ పత్రాలను సమర్పించడం లేదు. ఫలితంగా కేంద్రం సకాలంలో ఎస్సీ విద్యార్థులకు ఫీజును విడుదల చేయడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎస్సీ విద్యార్థులకు తన వంతు 40 శాతం సొమ్మును వారి తల్లుల ఖాతాకే చెల్లించింది. ఇది గత బకాయికి సంబంధించిన సొమ్ము అని చెబుతున్నప్పటికీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొలి త్రైమాసిక సొమ్ముగానే కళాశాలలకు సంకేతం అందింది. ప్రభుత్వం కళాశాలల ఖాతాలో బీసీ, ఎస్టీ విద్యార్థులకు జమ చేసిన సొమ్మును లెక్కలు వేసుకుంటే ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల సొమ్ముగానే తేలింది. వైసీపీ హయాంలో బకాయిపడ్డ సొమ్మును ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

అప్పుడు బకాయి.. ఇప్పుడు హడావిడి

వైసీపీ హయాంలో కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. అప్పట్లో బటన్‌ నొక్కారు. సొమ్మును మాత్రం తల్లుల ఖాతాలో జమ చేయలేదు. ఇలా జిల్లాలో కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేపట్టింది. తల్లుల ఖాతాలో వేస్తే ఎదురవుతున్న సమస్యలను పరిగణన లోకి తీసుకుంది. సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా కళాశాలలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. లేదంటే సొమ్ములు చెల్లించి సర్టిఫికెట్‌లు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థులపై అలాంటి ఒత్తిడి లేకుండా ఎప్పటిలాగే కళాశాలల ఖాతాలో జమ చేసేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బకాయిల్లో తొలి త్రైమాసిక ఫీజులను విడుదల చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ–బీసీ విద్యార్థులకు మాత్రమే చెల్లించాలి. మిగిలిన వారికి జమ చేసింది.

Updated Date - Feb 05 , 2025 | 01:21 AM