తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ABN, Publish Date - Jan 04 , 2025 | 12:59 AM
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. శుక్రవారం 4వ డివిజన్ మారుతీనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న రోడ్లు, డ్రెయినేజీ పనులను ఆయన పరిశీలించారు.
ఏలూరుటూటౌన్, జనవరి3 (ఆంధ్రజ్యోతి) : తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. శుక్రవారం 4వ డివిజన్ మారుతీనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న రోడ్లు, డ్రెయినేజీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీటి సమస్య ఉందని చెప్పడంతో సమస్య పరిష్కారానికి ప్ర ణాళికలు రూపొందించామని నిధులు మం జూరైన వెంటనే చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ భానుప్రతాప్, చోడే వెంకటరత్నం, ఎస్‌ఎంఆర్ పెదబాబు, ఆర్నేపల్లి తిరుపతి, పూజారి నిరంజన్ పాల్గొన్నారు. ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి విన తులు స్వీకరించారు. అర్హత కలిగిన వారికి నూ తనంగా పింఛన్లు, ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
9 నుంచి క్రికెట్ పోటీలు
ఏలూరు రూరల్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువతను ప్రోత్సహించేం దుకు ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు ఏలూరు సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తు న్నట్టు నిర్వాహకులు శేఖర్, హరి, వెంకట్, వినయ్‌గణేష్ తెలిపారు. శుక్రవారం సంబంధిత పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నగర యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మంచి నిర్ణయం అన్నారు. వివరాలకు 94413 30087 నంబరులో సంప్రదించాలని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ కమిటీసభ్యులు తెలిపారు.
Updated Date - Jan 04 , 2025 | 12:59 AM