ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబు 1న తణుకు రాక !

ABN, Publish Date - Jan 25 , 2025 | 01:20 AM

సీఎం చంద్ర బాబు ఫిబ్రవరి 1న తణుకులో పర్యటించే అవకాశం వుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష పీఎంఏవై – ఎన్టీఆర్‌ నగర్‌ లలో గృహ ప్రవేశాల కార్యక్రమానికి తణుకు నుంచే శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

కలెక్టర్‌, ఎస్పీ ఏర్పాట్ల పరిశీలన

లక్ష గృహ ప్రవేశాలకు తణుకులో శ్రీకారం చుట్టే అవకాశం..

కలెక్టర్‌, ఎస్పీ ఏర్పాట్ల పరిశీలన

పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి వుంది

తణుకు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్ర బాబు ఫిబ్రవరి 1న తణుకులో పర్యటించే అవకాశం వుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష పీఎంఏవై – ఎన్టీఆర్‌ నగర్‌ లలో గృహ ప్రవేశాల కార్యక్రమానికి తణుకు నుంచే శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. అలాగే పింఛన్‌దారులకు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు సీఎం చేతుల మీదుగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే షెడ్యూలు అధికారికంగా ఖరారు కావాల్సి వుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తణుకు, తేతలి, మండపాక పీఎంఏవై–ఎన్టీఆర్‌ నగర్‌లలో హౌసింగ్‌ లే అవుట్లను, తణుకు ఎస్‌ఎన్‌విఎం పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలోని హెలీపాడ్‌ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ అద్నాన్‌ నయూం అస్మి, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. వీరి వెంట ఏఎస్పీ వి.భీమారావు, ఆర్డీవో కతీబ్‌ కౌశల్‌బానో, హౌసింగ్‌ పీడీ వై.హరనాధ్‌, తహశీల్దార్‌ దండు అశోక్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 01:20 AM