45 కిలోమీటర్ల రహదారి.. రూ.2400 కోట్లు
ABN, Publish Date - Mar 04 , 2025 | 12:33 AM
జిల్లాలో అత్యంత ప్రధానమైన 165 జాతీయ రహదారికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది.
ఆకివీడు నుంచి దిగమర్రు రహదారి సమగ్ర పాజెక్ట్ నివేదిక సిద్ధం
165 హైవేకు డీపీఆర్
కేంద్రానికి సమర్పించిన అధికారులు
నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ.2400 కోట్లు
పెరిగిన అంచనా వ్యయం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అత్యంత ప్రధానమైన 165 జాతీయ రహదారికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఆకివీడు నుంచి దిగమర్రు వరకు 45 కిలోమీటర్ల నాలుగు లైన్ల జాతీయ రహదారి విస్తరణకు డీపీఆర్ రూపొందించడానికి అధికారులు భారీ కసరత్తు చేసి, కేంద్రానికి సమర్పించారు. రూ.2400 అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు వెళ్లాయి. గతంతో పోలిస్తే ఈ వ్యయం రెట్టింపు అయింది.
ఆకివీడు మీదుగా దిగమర్రు రహదారి రెండు లైన్లుగా విస్తరించడానికి గతంలో రూ. 1200 కోట్లతో అంచనా రూపొందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఆకివీడు నుంచి దిగమర్రు వరకు నాలుగు లైన్ల రహదారి విస్త రణకు అంచనా రూపొందించింది. వాస్తవానికి పామర్రు నుంచి ఆకివీడు మీదుగా దిగమర్రు వరకు 165 జాతీయ రహదారి విస్తరించి ఉంది. తొలిదశలో పామర్రు–ఆకివీడు వరకు నిర్మాణం చేపట్టారు. అక్కడ రెండు లైన్ల రహదారి మాత్ర మే ఏర్పాటు చేశారు. ఆకివీడు నుంచి దిగమర్రు వరకు రెండో దశ ప్రాజెక్ట్ చేపట్టాలి. కూటమి ప్రభుత్వ నాలుగు లైన్ విస్తరణ ప్రతిపాదనతో అంచనా వ్యయం కూడా రెట్టింపయ్యింది. రూ. 2400 కోట్లు వ్యయం కానుందని డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నెలాఖరులోగా కేంద్రం ఆమోద ముద్ర వేయాలి. అప్పుడే గతలో కేటాయించిన రూ.1200 కోట్లు మనుగడలో ఉంటాయి. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మపై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదా రులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. తాజా డీపీఆర్ కేంద్రం ఆమోదిస్తుందన్న నమ్మకం అందరిలో నెలకొంది.
పెరిగిన భూ వ్యయం
జిల్లాలో గడచిన పదేళ్లుగా భూముల రిజి స్ర్టేషన్ విలువ పెరిగింది. దాని ఆధారంగానే రైతులకు పరిహారం అందించాలి. అంచనా వ్యయం పెరగడానికి కూడా ఇది ఒక కారణం. ఆకివీడు, ఉండి. కాళ్ల, భీమవరం రూరల్, వీరవా సరం, పాలకొల్లు రూరల్ మండల గ్రామాల మీదుగా జాతీయ రహదారి వెళుతోంది. ఆక్వా చెరువులు విస్తరించి ఉన్నాయి. రొయ్యల చెరు వుల కారణంగా లవణీయత ఉండడంతో దానిని తొలగించి తర్వాత మట్టితో పూడ్చాలి. డెల్టా ప్రాం తంలో మట్టి తరలించాలంటే రవాణా భారం అధికం. జాతీయ రహదారి నిర్మాణంలో వినియో గించే మెటల్‌ను ఏలేశ్వరం ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవాలని అధికారులు నిర్ణయిం చారు. పంగిడి వద్ద లభించే మెటల్ రహదారి నిర్మాణానికి అనువుగా లేదని అధికారులు తేల్చే శారు. ఇలా జాతీయ రహదారి నిర్మాణానికి అవ సరమైన ముడి సరుకు కూడా ఆర్థిక భారాన్ని పెంచింది. దాదాపు 15 గ్రామాల పరిధిలో రాక పోకలు సాగించేందుకు జాతీయ రహదారికి కింది నుంచే వెళ్లేలా వంతెనలు ఏర్పాటు చేస్తు న్నారు. సర్కిల్‌ను ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే కింది నుంచి వెళ్లిపోయేలా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళి కలు రూపొందించారు. అక్కడ జాతీయ రహ దారిపైకి వెళ్లేలా, కిందికి దిగేలా అప్రోచ్ రహ దారులను ఏర్పాటు చేస్తారు. ర్యాంప్‌ల మాదిరి గా రహదారి నిర్మాణం ఉంటుంది. దీనికోసం కూడా అదనపు వ్యయం అవుతోంది. ఇవన్నీ పీడీఆర్ అంచనాలను పెంచాయి.
మూడు ఆర్‌వోబీలకు చెక్
తాజా ప్రతిపాదనలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లేకుండా చేశారు. లేదంటే జాతీయ రహదారి నిర్మాణానికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. రైల్వే అనుమతులు అంత వేగంగా లభించే అవకాశం లేదు. ఆర్‌వోబీల నిర్మాణం లేకుండా భీమవరం రూరల్ గ్రా మాల మీదుగా జాతీయ రహదారి వెళు తోంది. ఫలితంగా రహదారి నిర్మాణం త్వరితంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా సమ ర్పించిన డీపీఆర్‌పై కేంద్ర ఆమోదం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
Updated Date - Mar 04 , 2025 | 12:33 AM