ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

67 రోజుల్లో అనుమతి రాకుంటే..100 కోట్లు వెనక్కు!

ABN, Publish Date - Jan 24 , 2025 | 01:21 AM

లోసరి–భీమవరం–పిప్పర రహదారుల అభివృద్ధికి కేంద్ర రహదారుల నిధి(సీఆర్‌ఎఫ్‌) కింద రెండు నెలల క్రితం రూ.100 కోట్లు కేటాయించింది. కాని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వలేదు. మార్చి నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి కాకుంటే నిధులు మురిగిపోయే ప్రమాదం వుంది.

భీమవరం–లోసరి–పిప్పర రహదారుల అభివృద్ధికి కేంద్రం సీఆర్‌ఎఫ్‌ నిధులు

రెండు నెలల క్రితం మంజూరు.. రాష్ట్రం అనుమతిస్తేనే రోడ్ల నిర్మాణం

వైసీపీ సర్కార్‌ పెట్టిన భారీ బకాయిలతో రాష్ట్ర ప్రభుత్వం సతమతం

కొత్తగా అనుమతులు ఇచ్చేందుకు తటపటాయింపు.. అధికారులపై ఒత్తిడి

లోసరి–భీమవరం–పిప్పర రహదారుల అభివృద్ధికి కేంద్ర రహదారుల నిధి(సీఆర్‌ఎఫ్‌) కింద రెండు నెలల క్రితం రూ.100 కోట్లు కేటాయించింది. కాని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వలేదు. మార్చి నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి కాకుంటే నిధులు మురిగిపోయే ప్రమాదం వుంది. ఇంకా 67 రోజులు మాత్రమే మిగిలి వుంది. ఈలోగా పనులు ప్రారంభమైతేనే భీమవరం – తాడేపల్లిగూడెం రహదారికి మోక్షం లభిస్తుంది.

రూ.100 కోట్ల పనులు ఇవే..

భీమవరం నుంచి గొల్లవానితిప్ప మీదుగా బర్రివానిపేట వరకు వున్న డబుల్‌ రోడ్డును నాలుగు లేన్‌లుగా చేసేందుకు రూ.45 కోట్లు.

భీమవరం బైపాస్‌తోపాటు – గొల్లల కోడేరు వరకు నాలుగు లేన్‌ల రహదారి అభివృద్ధికి రూ.31.5 కోట్లు.

యండగండి–పిప్పర రహదారికి రూ.25 కోట్లు.. వెరసి కేంద్రం రూ.100 కోట్లు మంజూరుచేసింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గతంలో భీమవరం నుంచి యండగండి వరకు రహదారిని అభివృద్ధి చేశారు. అక్కడి నుంచి యండగండి వరకు సింగిల్‌ రోడ్డు ఉంది. గోతులమయంతో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. భీమవరం పట్టణ పరిధి లోనూ రహదారులు దెబ్బ తిన్నాయి. కేంద్ర ప్రభుత్వం సీఆర్‌ఎఫ్‌ పఽథకంలో మంజూరు చేసిన రూ.100 కోట్లతో ఆశలు చిగురించాయి. రహదారుల అభివృద్ధి సాధ్యపడుతుందని అంతా ఆనందపడ్డారు. భవిష్యత్తులో లోసరి –భీమవరం–తాడేపల్లిగూడెం వరకు జాతీయ రహదారి అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత రహదారిని విస్తరించాలి. అందుకు తగ్గట్టుగా కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. కాని రాష్ట్రస్థాయిలో పరిపాలన అనుమతులు మంజూరుచేయలేదు. ఈ జాప్యానికి పలు కారణాలున్నాయి. వైసీపీ హయాంలో సీఆర్‌ఎఫ్‌ నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.650 కోట్ల బకాయి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.150 కోట్లు చెల్లించారు. మరో రూ.500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ తరుణంలో సీఆర్‌ఎఫ్‌ నిధులకు మళ్లీ అనుమతులు ఇస్తే బకాయిలు పేరుకుపోతాయని ప్రభుత్వస్థాయిలో మల్లగుల్లాలు పడుతున్నారు.

వీటికి మార్చిలోగానే అనుమతులు ఇవ్వాలి. లేదంటే నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. కేంద్రం ఇచ్చే సీఆర్‌ఎఫ్‌ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరుస్తుంది. మిగిలిన 90 శాతం కేంద్ర మే చెల్లిస్తుంది. వైసీపీ హయాంలో మంజూ రుచేసిన నిధులకు పనులు పూర్తిచేశారు. నిధులు దారి మళ్లించారు. దీంతో బకాయిలు పేరుకుపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖలోనూ ఆర్థిక క్రమశిక్షణ అమలు చేస్తున్నారు. బకాయిలు ఒక్కొక్కటిగా చెల్లిస్తున్నారు. శాఖలను గాడిలో పెడుతున్నారు. గత ప్రభుత్వం బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లిస్తున్నారు. అయితే స్థానికంగా టెండర్లు పిలవాలంటూ నేతల నుంచి ఒత్తిడి అధికమవుతోంది. జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారులు పనులపై ఆపసోపాలు పడుతున్నారు. మరమ్మతులు చేపట్టడంలో బిజీగా ఉన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.100 కోట్ల నిధులకు టెండర్లు పిలిస్తే పనులు వేగవంతం అవుతాయని, భీమవరం పట్టణానికి రాకపోకలకు అనువుగా ఉంటుందని నేతలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తేనే ఇది సాధ్యపడుతుంది.

Updated Date - Jan 24 , 2025 | 01:21 AM