Women's Safety మహిళల భద్రతే లక్ష్యం
ABN, Publish Date - Mar 05 , 2025 | 11:09 PM
Women's Safety is the Goal మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది.
బెలగాం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళా సాధి కారత వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు, చిత్రలేఖనం, వ్యాసరచన, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతి , వారి హక్కులు, సమానత్వం, భద్రత, రక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మహిళలు అత్యవసర సమయాల్లో ఈ 1098, 181 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందొచ్చని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మహిళలపై నేరాల కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకుం టున్నామన్నారు. ఈ ర్యాలీలో ఏఎస్పీ అంకిత సురానా, ఐసీడీఎస్ పీవో టి.కనకదుర్గ, సీఐలు మురళీధర్, గోవిందరావు, ఎస్‌ఐలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 05 , 2025 | 11:09 PM