ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాంకేతిక యుగానికి నాంది పలకాలి

ABN, Publish Date - Feb 27 , 2025 | 11:49 PM

యువత నవ్య ఆవిష్కరణలతో కొత్త సాంకేతిక యుగానికి నాంది పలకాలని, ఈ దిశగా విద్యార్థులు చిన్ననాటి నుంచే కొత్త ఆలోచనలు చేసే విధంగా పరిస్థితులను ఏర్పరచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఐటి సలహాదారు, ఇండియన్‌ బ్లాక్‌చైన్‌ స్టాండర్డ్స్‌ కమిటీ చైర్మన్‌ జేఏ చౌదరి స్పష్టం చేశారు.

మాట్లాడుతున్న జేఏ చౌదరి :

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): యువత నవ్య ఆవిష్కరణలతో కొత్త సాంకేతిక యుగానికి నాంది పలకాలని, ఈ దిశగా విద్యార్థులు చిన్ననాటి నుంచే కొత్త ఆలోచనలు చేసే విధంగా పరిస్థితులను ఏర్పరచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఐటి సలహాదారు, ఇండియన్‌ బ్లాక్‌చైన్‌ స్టాండర్డ్స్‌ కమిటీ చైర్మన్‌ జేఏ చౌదరి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన జాతీయస్థాయి స్టూడెంట్‌ టెక్నికల్‌ పేపర్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ కాంటెస్ట్‌, ఎగ్జిబిషన్‌ (స్టెప్‌కాన్‌)లో ముఖ్యఅతిఽఽథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతోందని, కొత్తకొత్త టెక్నాలజీ రాబోతున్న సమయంలో భవిష్యత్‌లో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని తెలిపారు. ఇంజినీరింగ్‌ విద్యార్ధులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి 3,884 మంది విద్యార్థుల ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో, స్టార్టప్‌ ఐడియా కాంటెస్ట్‌, పేపర్‌ ప్రెజెం టేషన్‌, వర్క్‌షాఫ్స్‌ తదితర అంశాలు సదస్సులో నమోదుచేసుకున్నారు.

Updated Date - Feb 27 , 2025 | 11:49 PM