సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN, Publish Date - Jan 20 , 2025 | 11:30 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
సాలూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆమె అధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక నిర్వహించారు. పట్టణంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లె క్స్ అద్దెల విషయంలో అధికారులు పట్టించుకోవటం లేదని, అదనంగా జీఎస్టీ వసూలు చేస్తున్నారని ఒకరు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణం సమస్య పరిష్కా రించాలని ఆమె అధికారులను ఆదేశించారు. పారన్న వలసలో ఆర్వో ఎఫ్‌ఆర్ భూమి లేదని, అయితే ఇద్దరి పేరున నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేశారని, ఆ భూమిని కొంతమంది రాజకీయ నాయకు లు అనుభవిస్తున్నారని మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్ చొక్కాపు త్రినాథ మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ చేయాలని ఆమె రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. అలాగే తాగునీరు, పింఛన్లు, టిడ్కో ఇళ్లు, భూ కబ్జా, పార్కింగ్ లేని షాపింగ్‌మాల్స్.. ఇలా అనే సమస్యలపై సుమారు 139 వినతులు అందాయి. వీటిపై మంత్రి స్పందించి, తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ గ్రీవెన్స్‌కు 25 వినతులు
సీతంపేట రూరల్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం పీహెచ్‌వో వెంకటగణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 వినతులు వచ్చాయి. వీరఘట్టం మండలంలో హుస్సెనుపురం సచివాలయం నుంచి గదబవలస మీదుగా కత్తులకవిటి గ్రామం వరకు బీటీ రహదారి నిర్మించాలని రాయల కృష్ణ కోరారు. వడ్డంగి ఎంపీపీఎస్ పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మించా లని పాలక చౌదరి కోరగా నల్లరాయిగూడ గ్రామంలో వీధి కాలువలు నిర్మించాలని బిడ్డిక దివాకర్ కోరారు. ఇలా అనేక సమస్యల పరిష్కారం కోరుతూ పీజీఆర్‌ఎస్ కు గిరిజనుల నుంచి వినతులు వచ్చాయి. డీడీ అన్నదొర, టీడబ్ల్యూ ఇంజినీరింగ్ ఈఈ పి.రమాదేవి, ఐకేపీ ఏపీడీ సన్యాసిరావు, ఏటీడబ్ల్యువో మంగవేణి, ఏఎంవో కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 20 , 2025 | 11:30 PM