పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి: ఆర్డీవో
ABN, Publish Date - Mar 06 , 2025 | 12:19 AM
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిం చాలని, కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని బొబ్బిలి ఆర్డీవో రామ మోహనరావు ఆదేశిం చారు.
తెర్లాం, మార్చి 5(ఆం ధ్రజ్యోతి):ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిం చాలని, కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని బొబ్బిలి ఆర్డీవో రామ మోహనరావు ఆదేశిం చారు. బుధవారం మండలంలోని పెరుమాళి మోడల్‌స్కూల్‌లో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం పెరుమాళిలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం సేకరించిన స్థలాన్ని , తెర్లాంలో నిర్మించతలపెట్టిన నియోజకవర్గ స్థాయి ఎంఎస్‌ఎంఈ పార్క్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని ఆర్డీఓ పరిశీలించారు. సబ్‌స్టేషన్, పార్క్‌లకు సంబంధించిన ప్రగతిని తహసీల్దార్ హేమంత్ కుమార్, ఎంపీడీవో రాంబాబులను ఆర్డీవో అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Mar 06 , 2025 | 12:19 AM