బంద్‌కు తాత్కాలిక విరమణ
ABN, Publish Date - Feb 13 , 2025 | 12:33 AM
గిరిజనుల కోసం రూపొందించిన 1/70 చట్టాన్ని సవరణ చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం తలపెట్టిన బంద్‌కు తాత్కాలిక విరమణ ఇస్తున్నట్టు ఏజేఏసీ మండల అధ్యక్షులు బి.శ్రీని వాసరావు తెలి పారు.
సీతంపేట రూరల్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): గిరిజనుల కోసం రూపొందించిన 1/70 చట్టాన్ని సవరణ చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం తలపెట్టిన బంద్‌కు తాత్కాలిక విరమణ ఇస్తున్నట్టు ఏజేఏసీ మండల అధ్యక్షులు బి.శ్రీని వాసరావు, ఉమామహేశ్వరరావు, సీపీఎం నాయకుడు తిరుపతిరావు తెలి పారు. బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వారు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన చట్టాలను సవరణ చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక టించిన నేపథ్యంలో బంద్‌కు తాము తాత్కాలిక విరమణ ఇచ్చామన్నారు. మన్యం బంద్‌కు మద్దతు తెలిపిన గిరిజన సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డిక అప్పారావు, భాస్కరరావు ఉన్నారు.
Updated Date - Feb 13 , 2025 | 12:33 AM